కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె భర్త పరకాల ప్రభాకర్ మధ్య సైద్ధాంతిక వైరధ్యం ప్రసార మాద్యమాలకు ఎక్కింది. పరకాల ప్రభాకర్- బీజేపీ ఆర్థిక విధానాల ను విమర్శిస్తూ, జాతీయాంగ్ల దిన పత్రిక ది హిందూ “ఎడిటోరియల్ ఆర్టికల్” రాశారు.  నేరుగా కాకపోయినా, ఆర్థిక మంత్రిగా తన భార్య నిర్మలా సీతారామన్ తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టారు. నిర్మలా సీతారామన్ దేశ ఆర్థికవ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, ఆర్ధిక మందగమనం నుంచి శరవేగంగా బయటపడెందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. 

ప్రతి వారం ఒక్కో రంగానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇవి ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ఎంత వరకు లాభం చేస్తున్నాయో? కానీ, నిపుణులు, మేధావులకు ఏ మాత్రం నచ్చడం లేదు. ఇప్పుడు ఆ మేధావులు, నిపుణుల వర్గంలో - నిర్మలా సీతారామన్ భర్త, ఆర్ధిక విషయాల నిపుణులు పరకాల ప్రభాకర్ కూడా చేరడమే అసలు మడత పడింది. ఋఆవ్ – సింగ్ (పీవీ నరసింహా రావు, మన్మోహన్‌ సింగ్) విధానాలే దేశానికి ప్రయోజనం కలిగించేలా ఉండేవని పొగిడేశారు.  ఈ విషయంలో ఢిల్లీలో కలకలం రేపడంతో, మీడియా ప్రతినిధులు, దీనిపై నిర్మలా సీతారామన్ స్పందన కోసం, ఎదురు చూశారు. ఆమె దీనిపై చాలా సున్నితంగా స్పందించారు. 

తన భర్త రాసిన వ్యాసంలోని వాడి వాడి విమర్శలపై నిర్మలా సీతారామన్‌ సూటిగా స్పందించ లేదు. అయితే, 2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణల్ని చేపట్టింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జీఎస్టీ, ఆధార్‌, వంటగ్యాస్‌ పంపిణీ వంటి చర్యల్నీ చేపట్టింది మోదీ సర్కారేనని తెలిపారు. అసలు గత ఐదేళ్లలో తాము చేపట్టిన సంస్కరణల వల్లే ఫలితాలొస్తున్నాయని చెప్పుకున్నారు. పరకాల ప్రభాకర్ ప్రస్తుతం బీజేపీలో లేరు. ఒకప్పుడు బీజేపీ లో ఉండేవారు. తర్వాత చిరంజీవి - పీఆర్పీలో ఉన్నారు. చివరకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, “మీడియా సలహాదారు” గా కీలకపాత్ర పోషించారు. బీజేపీతో టీడీపీ స్నెహం తెంచేసుకున్న దరిమిలా - విమర్శలు రావడంతో, టిడిపి ఇచ్చిన పదవిని వదులుకున్నారు. ఇప్పుడు రాజకీయాలకే దూరంగా ఉన్నారు. 

మళ్ళీ బీజేపీలో మాత్రం చేరలేదు బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఉండుండి ఇప్పుడు – తన భార్య నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్న వేళ ఆ శాఖకు సంభందించి ఆమె ఎప్పటికప్పుడు, కొత్త నిర్ణయాలు ప్రకటిస్తున్న వేళ ఆ ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది.

దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన కామెంట్లు ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే, పరకాల ఆర్థిక అంశాల్లో పట్టున్న నిపుణుడే. కానీ భార్య ఆర్థిక మంత్రి గా ఉన్నప్పుడు, పరకాల ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

“దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. ఒకదాని తర్వాత మరో రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయినా దీన్ని అంగీకరించేందుకు మోదీ సర్కారు సిద్ధంగా లేదు’’ అని ఆయన మోదీ ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం అదనంగా ‘‘జవహర్లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలను రాజకీయ కోణంలో విమర్శించడం తప్ప బీజేపీకి సొంత విధానమంటూ ఏదీ లేదు. ఆర్థికవిధానాలకు సంబంధించి ‘ఇది కాదు, ఇది కాదు’ అనడమే తప్ప ఏది ఉండాలన్న స్పష్టతలేదు”  అని విమర్శించటమే కాదు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మాజీ ప్రధానులు రావు-సింగ్‌ల విధానాల అనుసరణే శరణ్యమని చెప్పారు.
 
ఆయన వ్యాఖ్యలపై నిర్మల సీతారామన్‌ “2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణల్ని చేపట్టింది మోదీ ప్రభుత్వమే. జీఎస్టీ, ఆధార్‌, వంటగ్యాస్‌ పంపిణీ వంటి చర్యల్నీ చేపట్టింది మోదీ ప్రభుత్వమే” అంటూ ముక్తాయింపు పలికారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: