మీడియా, రాజకీయాలు ఒకే గాటన కట్టాల్సిన పరిస్థితి ఇపుడు ఉంది. రాజకీయ నాయకుల కంటే దూకుడుగా మీడియా పెద్దలు ఉన్నారు. దాంతో వారి మధ్యన అనుబంధం గట్టిపడడంతో ప్రజా  ప్రయోజనాలు పక్కకు పోతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి మీడియా అంటేనే ఫలనా వారిదా అనే పరిస్థితి వచ్చేసింది.


ఇదిలా ఉండగా ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ టీడీపీ అనుకూలవాదిగా వైసీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత టీడీపీ సర్కార్ విశాఖ జిల్లా పరదేశిపాలెం వద్ద కేటాయించిన ఎకరన్నర భూమిని ఈ రోజు జరిగిన వైసీపీ మంత్రివర్గ సమవేశంలో రద్దు చేశారు. దాదాపు నలభై కోట్ల విలువైన ఈ భూమిని గత ప్రభుత్వం క్విడ్ ప్రోకో పద్ధతిలో కేటాయించిందని మీడియా సమావేశంలో సమాచార మంత్రి పేర్ని నాని తెలియచేశారు.


ఇది  పూర్తిగా  అవసరం లేని కేటాయింపు అని కూడా ఆయన అన్నారు. నలభై  కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని గత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం యాభై లక్షల అయిదు వేల రూపాయలకు కేటాయించిందని మంత్రి చెప్పారు. ఆ భూ కేటాయింపు రద్దు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు.


ఇక   ఆ భూమిలో బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్లుగా మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ భూమిలో నిర్దిష్ట కార్యకలాపాలు సాగడంలేనందువల్ల రద్దు చేశామని ఆయన వివరించారు. రాజకీయంగా శత్రువుల మీద విష ప్రచారం చేయడానికే గత ప్రభుతం ఈ భూమిని ఆ మీడియాకు కేటాయించిందని కూడా మంత్రి పేర్ని చెప్పడం విశేషం. 


మొత్తానికి అంధ్ర జ్యోతి రాధాక్రిష్ణకు కేటాయించిన భూమిని రద్దు చేయడం సంచలన‌మైన నిర్ణయమే. బాబుకు సన్నిహితునిగా ఉంటున్నారని పేరుపడిన ఆయన వైసీపీ వ్యతిరేక వార్తలను రాస్తున్నారన్నది ఆ పార్టీ నేతల ఆరోపణ. దాంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: