తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖల్లో ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ వెల్లడించింది. ఇకపై జీతం డబ్బుల కోసం రోజుల తరబడి వేచి ఉండవలసి  చూసే ధోరణికి స్వస్తి పలుకుతుంది. ప్రతీ నెలా 7వ తేదీన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాల్లో వేతనం డబ్బులు నేరుగా జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.


 ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలంటూ ఆర్థిక మంత్రి హరీశ్ రావును, మంత్రి ఈటల కోరడం జరిగింది. మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో వీరిద్దరు భేటీ అవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందిస్తున్నట్టు.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 7వ తేదీన జీతాలు అందించాలని జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం ఉంది ఇప్పటి వరుకు.


కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.20 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. సకాలంలో జీతాలు అందక వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ప్రతీ నెలా 7వ తేదీన జీతాలు అందిస్తే.. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న  పరిస్థితుల్లో కొన్ని శాఖల్లోని ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందడం లేదు. కాగా ఇలాంటి తరుణంలో ప్రభుత్వం 7వ తేదీన జీతాలు ఇవ్వాలని నిర్ణయించడం కచ్చితంగా వారికి సంతోషానిచ్చే విషయమే అని అర్థం అవుతుంది.


అన్ని విషయాలలో బాగా నిర్యాణం తీసుకునే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు ఆర్టీసీ సమ్మె కార్మికులకు ఎందుకు న్యాయం చేయడం లేదో అర్థం కావడం లేదు మరి. ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా కనికరం కలవడం లేదేమో తెలంగాణ సర్కార్ కి..ఇప్పటి కైనా స్వస్తి పలుకుతుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: