సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎలా అయితే జనాల్ని ఆకట్టుకుంటారో.! ఇప్పడు టీడీపీ సీనియర్ నేత - మాజీ ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి సైతం ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేసుకొని జేసీ వ్యాఖ్యానించారు. అయితే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన జేసీ... జగన్ సీఎం అయ్యాక మాత్రం కొంత తన వైఖరి ని మార్చేశారు.. జగన్ కు అనువుగా పాజిటివ్ గా కొన్ని చిలక పలుకులు పలికేస్తున్నారు..

ఇక తాజాగా మరోసారి జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పరిపాలన గురించి చెప్పాలంటే మరో ఆరు నెలల గడువు కావాలని ఆయన్ని పొగిడినట్టే చెప్పుకొచ్చారు. ముందు జగన్ కు పరిపాలనా అనుభవం లేదని చెప్పిన జేసీ.. ఇపుడు జగన్ కు మంచి - చెడు చెప్పేవారే లేరని.. జగన్ పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు. జగన్ కేవలం ప్రధానమంత్రి మోదీ మంత్రదండం వల్లే అధికారంలోకి వచ్చారని కూడా జేసీ సంచలనం రేపారు. ఏదేమైనా మరోసారి జేసీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ విషయంలో ఆచితూచి మాట్లాడుతోన్న జేసీ ఇప్పుడు మోదీ కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చాడనడం ఆసక్తికరమే. ఇక జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. 

ఇదిలా ఉంటే టీడీపీలో కొనసాగేందుకు జేసీ వారసులు ఆసక్తితో లేకపోవడంతో రాజకీయంగా ఆ పార్టీ నుంచి ఎలా బయటపడలా..?? అన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా గెలిచిన పార్టీ నే వదలని ప్రతిపక్ష నేతలు ఇపుడు అత్యంత మెజార్టీతో గెలిచిన పార్టీ ని ఎలా వదిలిపెడతారు.. ఇదంతా జేసీ పార్టీ మారే వ్యూహమో..?? కాదో..?? తెలియాల్సి వుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: