కొత్త మార్కెట్ లోకి తోలిసారిగా ప్రవేశించిన వారు సరిగా ప్రణాళిక రచించి అమలు చేస్తే మార్కెట్ లో దూసుకు పోవటం ఖాయం. అయితే వేరే వెర్షణ్ లో తన చరిత్రాత్మక మోడల్ ను ప్రవేశ పెడితే ప్రచారం అవసరం లేదు సరికదా! మార్కెట్ లో దుమ్ము లేపేయవచ్చు. ఆ చరిత్ర ప్రముఖ వాహన తయారీ కంపెనీ 'బజాజ్ ఆటో లిమిటెడ్‌' ది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగం లోకి ఇప్పుడు బజాజ్ ఎంట్రీ ఇచ్చింది.  
Image result for bajaj chetak electric scooter
బజాజ్ చేతక్ చరిత్ర 

1960లో రాజస్థాన్‌కు చెందిన "రాహుల్ బజాజ్" అనే యువ పారిశ్రామిక వేత్త బజాజ్ స్కూటర్లకు ప్రాణం పోశారు. ఇటలీ కంపెనీ నుంచి తెచ్చుకున్న లైసెన్స్ తో స్కూటర్ల తయారీకి శ్రీకారం చుట్టారు. భారత ద్విచక్ర వాహన విభాగంలో చరిత్ర సృష్టించిన బజాజ్ చేతక్ స్కూటర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో! ఒకప్పట్లో “స్టేటస్ సింబల్‌” గా నిలిచిన బజాజ్ స్కూటర్లు తర్వాతి కాలంలో ఆటోమొబైల్ రంగంలో చోటు చేసుకున్న పలు విప్లవాత్మక మార్పుల కారణంగా కాలగమనంలో కలిసిపోయిన సంగతి తెలిసినదే. 
Image result for youngest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAHUL' target='_blank' title='rahul - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rahul </a>bajaj
ప్రస్తుతం కేవలం మోటార్‌ సైకిళ్ల ఉత్పత్తిపై మాత్రమే దృష్టి సారిస్తున్న బజాజ్ ఆటో తిరిగి స్కూటర్ విభాగంలోకి ప్రవేశించాలంటే “చేతక్” స్కూటర్లను మోడ్రన్ టెక్నాలజీ, అధునాత ఇంజన్లతో పునరిద్ధరించడమే ఉత్తమ మార్గం అనుకున్నారు. 

ప్రఖ్యాత భారత యోధుడు మహారాణ ప్రతాప్ సింగ్ కు అత్యంత ఇష్టమైన గుఱ్ఱం ఉండేది. దాని పేరు “చేతక్”. దానినే తన స్కూటర్ కు పేరుగా పెట్టారు రాహుల్ బజాజ్
చరిత్రలో కలిపేసిన తన పాపులర్‌ మోడల్‌ చేతక్‌ స్కూటర్‌ - సెకండ్ ఇన్నింగ్స్ ను సరికొత్త వెర్షన్ 'ఎలక్ట్రిక్ స్కూటర్' గా మార్కెట్‌ కు  నేడు బుధవారం పరిచయం చేసింది.  ప్రఖ్యాతిగాంచిన బజాజ్ ట్యాగ్‌-లైన్ 'హుమారా బజాజ్' ను 'హుమారా కల్' అనే కొత్త నినాదంతో  "చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌" ను అర్బనైట్ ఈవీ  బ్రాండ్ కింద  తీసుకొచ్చింది. 
Image result for maharana pratap on his chetak
మహరాష్ట్రలోని తమ "చకన్' ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త చేతక్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అయితే దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కాని దీని ధర ₹ 1.50 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తుంది. ఈ వాహనం 2020 జనవరిలో నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనల్ని పలకరించనుంది. ఇక హోండా - యాక్టివా కు గడ్దుకాలమే! 
Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAHUL' target='_blank' title='rahul - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rahul </a>bajaj and rajiv bajaj
దాదాపు ఒక దశాబ్దం తర్వాత రెండవ ఇన్నింగ్స్‌ను  ప్రారంభించింది. మోటారు సైకిళ్ల పై దృష్టి పెట్టడానికి బజాజ్ 2009 లో సాంప్రదాయ స్కూటర్ల తయారీని నిలిపి వేసింది బజాజ్‌. ఎలక్ట్రిక్ స్పేస్‌ లో స్కూటర్లు, త్రీ వీలర్లకు అపారమైన అవకాశం ఉందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈరంగంలోకి  మొదటగా రావడం, మార్కెట్లో మొదటి స్థానంలో ఉండటం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 

Image result for bajaj chetak electric scooter

మరింత సమాచారం తెలుసుకోండి: