హుజూర్ నగర్ లో గెలుపు ఎవరిది..?  ఎవరికి వారు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నా.... ఎవరి వ్యూహాన్ని వాళ్ళు అమలుచేసే పనిలో పడ్డారు. ఒకరు సెంటిమెంట్.. అభివృద్ధి అంటుంటే... ఇంకొకరు ఆత్మగౌరవ సమస్యగా చూస్తున్నారు. 


హుజూర్ నగర్ ఎన్నికలలో ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్... ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో రెండు ప్రధాన పార్టీలు ప్రజల మనసు గెలిచే పనిలో పడ్డారు. అధికార పార్టీ అభివృద్ధి మంత్రం ఎత్తుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా... ఎవరు ఏం చేశారో చర్చిద్దాం రండి అంటోంది. 


అధికార టీఆర్ఎస్ పార్టీ... హుజూర్ నగర్ లో ఉత్తమ్ సీటును కైవసం చేసుకోవాలని పట్టుదలదతో ఉంది. ఇన్నాళ్లూ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఎదురుదాడి చేస్తోంది. పద్మావతి గెలిస్తే... ఉత్తమ్ ఇంట్లో ఇంకో ఎమ్మెల్యే పెరుగుతారు తప్ప.. హుజూర్ నగర్  ప్రజలకు లాభం ఏమిటని ప్రశ్నిస్తోంది. సైదిరెడ్డికి ఒక్క ఛాన్స్ అంటూ క్యాంపైన్ చేస్తోంది. 


కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ తో పాటు...హుజూర్ నగర్ ప్రజల ఆత్మగౌరవ నినాదం ఎత్తుకుంది. ఒక్కరి కోసం 700 మందితో దాడి చేస్తారా.. అని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది.  పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కు.. ఆయన భార్య అభ్యర్థి కావడం ఉప ఎన్నిక పరువు సమస్యగా మారింది. పద్మావతి గెలుపు కోసమే కాదు... ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో పాటు కాంగ్రెస్ లైఫ్  కూడా హుజూర్ నగర్ గెలుపుతో ముడిపడి ఉంది. హుజూర్ నగర్ ఎన్నికలు... అధిక పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారితే... కాంగ్రెస్ కి పరువు నిలబెట్టుకోవాలన్న కసితో ఉంది. మొత్తానికి అటు అధికార పార్టీ టీఆర్ఎస్... ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. రెండు పార్టీలు రెండు నినాదాలు ఎత్తుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు చేయని కసరత్తులు లేదు. చూద్దాం ఏ పార్టీ నినాదం అధికారంలోకి తీసుుకవస్తుందో..! 

మరింత సమాచారం తెలుసుకోండి: