మద్య నిషేధం....అసాధ్యం కానీ పని. అయితే ఈ అసాధ్యాన్ని సాధ్యం చేస్తానని చెప్పి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తన పాదయాత్ర సందర్భంగా మద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న అక్కాచెల్లెళ్ల కుటుంబాల బాధలు విన్న జగన్ అధికారంలోకి రాగానే అంశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక అనుకున్నదే తడువు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంలో తొలి అడుగు వేశారు.


ప్రతి ఏటా 20 శాతం మద్యం షాపులని తగ్గించుకుంటూ వెళుతూ...చివరికి మద్యాన్ని స్టార్ హోటళ్ళకే పరిమితం చేయనున్నామని ప్రకటించారు. అందులో భాగంగా ఈ ఏడాది 20 శాతం షాపులని బంద్ చేసి, మిగిలిన దాదాపు 3500 షాపులని ప్రభుత్వమే నిర్వహించడానికి సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందించి, అక్టోబర్ 1 నుంచి మద్యం షాపులని ప్రభుత్వమే నిర్వహించడం మొదలు పెట్టింది. అలాగే వీటిల్లో నిరుద్యోగులకు అవకాశం కూడా కల్పించారు.


అయితే దీనికంటే ముందు జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులని క్లోజ్ చేసింది. అలాగే అక్రమ మద్యం, నాటుసారాని అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుని నియమించారు. స్కూళ్లు, ఆధ్యాత్మిక సంస్థలకు దగ్గరగా మద్యం షాప్‌లు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వమే నిర్వహిస్తున్న వైన్ షాపు ల్లో మద్యం వినియోగాన్ని తగ్గించారు. చాలా బ్రాండ్లని తగ్గించేశారు. అలాగే మద్యం రేటుని కూడా పెంచారు. ఒక మనిషి మూడు మద్యం బాటిళ్ళని కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.


అలాగే రాష్ట్రం మొత్తం ఎక్కువ డీ అడిక‌్షన్‌ సెంటర్‌‌ల ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయాల వల్ల మద్యం వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయ్యాయి గానీ, మద్యం వినియోగం పెద్దగా తగ్గలేదు. మొత్తానికి అయితే మద్యం నిషేధంలో జగన్ వేసిన తొలి అడుగు కొంతవరకు విజయవంతమైందని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: