జియో.. డిజిటల్ ఇండియా కావడానికి ఒకరకంగా సహాయం చేసింది ఈ జియో అనే చెప్పాలి. ఒక జిబి నెట్ నెల రోజులు వాడే రోజులలో రోజుకు ఒక జిబి ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చి ప్రతి ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టింది జియోనే. ఒక జీబీ నెట్ కొనాలంటే ఆకాలంలో 159 రూపాయిలు ఉండేది. అలాంటి రోజుల్లో జియో రోజుకో ఒక జిబి ఇచ్చి సంచలనం సృష్టించింది. 


అయితే ఇంతవరుకు ఫ్రీ కాల్స్ ఇచ్చిన జియో వారం రోజుల క్రితం సంచలన నిర్ణయం తీసుకుంది. జియో టూ జియో ఫ్రీ అని, జియో టూ ఇతర నెట్ వర్క్స్ కి కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసలు పడుతుందని ప్రకటించింది. దీంతో జియోపై అందరూ వినియోగదారులు మొదట కోపం తెచ్చుకున్న తక్కువే కదా ముందుకన్నా అని సర్దుకు పోయారు. 


అయితే ఇప్పుడు జియోకు షాక్ ఎయిర్టెల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ సర్వీసుల ధరలు అస్థిరంగా ఉన్నాయని.. ఈ ధరలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విట్టల్‌ అభిప్రాయం పడ్డారు. ఈ విధానాన్ని మొబైల్ సర్వీసులు ఎప్పుడు కొనసాగించాలని, ఐయూసీకి టారీఫ్‌లతో సంబంధం లేదని అవి కేవలం కాల్స్‌ను ట్రాన్స్‌మిట్‌ చేసినందుకు అయ్యే ఖర్చును చెల్లించడం అని దానికి సంబంధించి ఇప్పటివరకు రెండు సంస్థల మధ్యే పరిష్కరించుకొంటున్నాం అని గోపాల్‌ విట్టల్‌ అన్నారు. 


దీంతో జియో వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఎయిర్టెల్ పై ట్రోల్స్ వెయ్యడం ప్రారంభించింది. ఇంకా ఇంకా పెంచండి.. త్వరలోనే ఎయిర్టెల్ మూసేసుకుంటారు అంటూ మండిపడిపోయారు నెటిజన్లు. ఇప్పుడు జియో పెంచిందే దుర్మార్గం అని అనుకుంటే మళ్ళి జియోకు షాక్ ఇవ్వాలనుకుంటున్నావా ? ఏంటి ? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఎయిర్టెల్ కూడా అచ్చం జియోలనే చార్జీలు పెంచుతుందా ? లేదా అనేది చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: