ఆ పార్టీలో అయన్ను  ఒకే ఒక్కడు అని అనుకోవచ్చు. ఎందుకంటే జనసేన తరపున గెలిచింది ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ఒక్కడే కాబట్టి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎస్సీ  నియోజకవర్గంలో జనసేన తరపున పోటి చేసి గెలిచాడు. ఈయనేమీ ఆషా మాషీగా గెలవలేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఓసారి గెలిచాడు.

 

వైసిపి గాలిలో కూడా ఎదురు నిలిచి అందులోను జనసేన తరపున గెలిచాడంటే మామూలు విషయం కాదు. అలాంటి రాపాకకు పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయట. ఎంఎల్ఏను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్దేశ్యపూర్వకంగానే అవమానిస్తున్నాడని పార్టీలో ప్రచారం జరుగుతోంది.  

 

పార్టీలోని సీనియర్ నేత అద్దేపల్లి శ్రీధర్ ఈ విషయంలో బహిరంగంగానే పవన్ ను తప్పుపడుతున్నారు. పవనే కాకుండా మరో ప్రముఖ నేత మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన నాదెండ్ల మనోహర్ కూడా రాపాకను అవమానించినట్లు అద్దేపల్లి మండిపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఎంఎల్ఏగా గెలిచిన రాపాకను అవమానించటమేంటి ? అంటూ శ్రీధర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

 

ఈమధ్య జరిగిన పార్టీ కార్యక్రమానికి రాపాక కాస్త లేటుగా హాజరయ్యారట. వేదిక మీద కానీ ఇవతల కానీ రాపాక కూర్చోవటానికి ఒక్క కుర్చీ కూడా లేదట. కుర్చీ ఖాళీగా లేకపోవటం అలా ఉంచితే కనీసం ఏ ఒక్కరూ లేచి కుర్చీని కూడా ఆఫర్ చేయలేదట. ఇదే సందర్భంలో నాదెండ్ల జోక్యం చేసుకుని కార్యక్రమానికి లేటుగా వస్తే ఎలా బొట్టు పెట్టి పిలవాలా ? అంటూ ఘాటుగా మాట్లాడారట.

 

విచిత్రమేమిటంటే నాదెండ్ల మాట్లాడేటప్పుడు వేదిక మీద పవన్ కూడా ఉండటం. అంటే నాదెండ్ల వ్యాఖ్యలకు పవన్ మద్దతున్నట్లే అని అందరూ అనుకుంటున్నారు. ఇదే కాకుండా పార్టీ తరపున నియమించిన చాలా కమిటిల్లో రాపాకకు అవకాశం ఇవ్వలేదు. నియోజకవర్గంలో కనీస మాత్రం బలం కూడా లేని నాదెండ్ల వంటి వారు పార్టీలో పవన్ అండ చూసుకుని విపరీతమైన అథారిటిని చెలాయిస్తు రాపాకను అవమానించటమే ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: