మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య  ప్రమాదానికి గురైన రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ఆచూకీ దొరికినట్టు సమాచారం. బోటు వెలికితీత చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన లంగర్లకు బలమైన వస్తువు చిక్కినట్టు ఉంది. నది లోపలికి పంపిన లంగర్లకు  బలమైన వస్తువు తాకినట్టు అధికారులు చెపుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆచూకీ దొరకని మునిగిపోయిన బోటును బయటకు తీసే బాధ్యతలను ధర్మాడి సత్యం బృందం చేపట్టింది. ఇందులో భాగంగా బోటును వెలికితీసేందుకు నది లోపలికి పంపిన లంగర్లకు బలమైన వస్తువు తగిలింది. ఈ పరిణామంతో మునిగిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తామని బృందం స్పష్టం చేస్తుంది. 



తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును  వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ బోటు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ప్రయాణీకులు, బోటు సిబ్బందితో కలిపి మొత్తం 73 మంది ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డన విషయం కూడా విదితమే. కాగా బోటు మునకలో  మొత్తం 33 మృతదేహాలు లభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. 



దీంతో ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకని పరిస్థితి. అప్పట్లో గల్లంతయిన వారి కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్, 6 అగ్నిమాపక, 2 నేవీ గజఈతగాళ్ళ బృందాలు, రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్జీసీ హెలికాపర్‌తో సహాయంతో  ఏపీ విపత్తుల శాఖ గాలింపు చర్యలు చేపట్టింది. ఇందుకు ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. సైడ్ స్కాన్ సోనార్, ఇతర ఆధునాతన పరికరాలతో గాలింపు చర్యల్లో పాల్గొన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో  ధర్మాడి సత్యం అధ్యవ్యంలో బృందం ఈ వస్తువును బయటకు లాగుతోంది. ఆ వస్తువు మునిగిపోయిన బోటు అయివుంటుందని భావిస్తున్నారు. మునిగిపోయిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తామని బృందంలోని సభ్యులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: