మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లలో చిరంజీవి ఎక్కడా తగ్గడం లేదు. మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్ ను కలిసి సినిమా చూడమని కోరారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కలసి సినిమా చూశారు.


ఈ క్రమంలో చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. వెంకయ్య నాయుడిని చిరంజీవి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని చూడాల్సిందిగా చిరంజీవి ఆయన్ను కోరారు. ఈ సినిమా కోసం వెంకయ్య నివాసంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.


వెంకయ్య నాయుడు, ఆయన కుటుంబసభ్యులు, పలువురు కేంద్ర పెద్దలతో కలిసి చిరంజీవి ఢిల్లీలో ‘సైరా’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా చూసిన తర్వాత వెంకయ్య కూడా ఫిదా అయ్యారు. అభినందనలు కురిపించారు. బ్రిటీష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ.. స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తితో రూపొందించిన సైరా చిత్రం బాగుందని ట్వీట్ చేశారు.


ఈ సినిమాలో నటించిన నటులు శ్రీ చిరంజీవి, శ్రీ అమితాబ్ బచ్చన్, దర్శకుడు శ్రీ సురేందర్ రెడ్డికి అభినందనలు, నిర్మాత శ్రీరామ్ చరణ్ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు అంటూ పోస్టు చేశారు. చిరంజీవి ఈ చిత్ర ప్రదర్శనకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర పెద్దలను చిరంజీవి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.


అయితే ఈ ప్రమోషన్ల విషయంలో చిరంజీవి కొంత ఆలస్యం చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సైరా విడుదలై చాలా రోజులైంది. ఈ ప్రమోషన్ల వ్యవహారం ఇంకాస్త ముందు చేసి ఉంటే.. ఇది సినిమా క్రేజ్ ను ఇంకాస్త పెంచేవి.. ఇప్పుడు చిరంజీవి ప్రముఖులను కలిసి సినిమా చూడమని కోరుతున్నా.. అది సినిమా ప్రమోషన్ కు పెద్దగా ఉపయోగపడే అవకాశం కనిపించడం లేదు. మరి ఈ విషయంలో చిరంజీవి ఎందుకు ఆలస్యం చేశారో.


మరింత సమాచారం తెలుసుకోండి: