ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ నిర్ణయాలు కూడా కొన్నింటిలో వేగంగా తీసుకుంటోంది. మరికొన్ని పాలసీల పేరు మీద జాప్యం చేస్తోంది. అయితే ఓ వైపు సంక్షేమ  పధకాల‌ను పరుగులెత్తిస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని సంపాదిస్తున్న జగన్ కొన్ని విషయాల్లో మాత్రం ఏమీ చేయలేకపోతున్నారని అంటున్నారు.


ఫలితంగా జగన్ సర్కార్ చెడ్డపేరు మూటకట్టుకుంటోంది. అదే సమయంలో విపక్షం కూడా సరిగ్గా అక్కడ చూసి మరీ గురిపెడుతోంది. దీంతో విలవిలలాడడం వైసీపీ  సర్కార్ వంతు అవుతోంది. ఏపీలో ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. ఇసుక కొరతతో ఇపుడు భవన నిర్మాణాలు ఆగిపోయాయి. దాంతో అందులో పనిచేసే కార్మికులు సైతం ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు.


వారికి రోజూ వారి ఉపాధి పోయింది. దాంతో గత నాలుగు నెలలుగా వారు రోడ్డున పడుతున్నారని అంటున్నారు. ఈ సమస్య ఇపుడు వైసీపీ సర్కార్ని బాగా ఇబ్బంది పెడుతోంది. అయితే మంత్రివర్గ సమావేశంలోనూ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇదే  విషయాన్ని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ ఇంకా కార్యరూపం దాల్చడానికి రెండు నెలల సమయం పడుతుందని  వరదల కారణంగ ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయని వెల్లడించారు.


అంటే ఇది పిడుగులాంటి వార్తే అంతవరకూ భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండడం అంటే ఇబ్బందికరమే. ప్రభుత్వం ఆలోచించి ఏదో ఒకటి చేయలి మరి. లేకపోతే మంచి పేరు దేముడెరుగు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది.  సామాన్యులు ఇపుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక అతి ముఖ్యమైపోయింది. ఓ విధంగా ఇసుక కొరతతో బంగారంతో పోటీ పడుతోంది. దీంతో ఇసుకపై సరైన విధానం లేక గత సర్కార్ ప్రజావ్యతిరేకత మూటకట్టున్న సంగతి విధితమే. మరి దాన్ని చూసి అయినా జగన్ జాగ్రత్త పడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: