అమిత్ షా అంటేనే ఆ పేరులో ఏదో మ్యాజిక్ ఉంది. అమిత్ షా తలచుకుంటే ఏమైనా చేయగలరు అంటారు. అందుకు తాజా ఉదాహరణ ఒకనాటి దేశ హోం మంత్రి చిదంబరం ఇపుడు జైలు వూచలు లెక్కబెట్టడమే. అమిత్ షా బలమైన నాయకుడు అంటారు దేశంలోని ముఖ్యమంత్రులంతా ఒక్క మాటగా. ఇక బీజేపీ వారైతే అమిత్ షా తలచుకోవాలి కానీ అది కచ్చితంగా జరిగిపోతుందని ఘంటాపధంగా చెబుతారు.


అంతటి సమర్ధుడు  అమిత్ షా ఇపుడు ఏపీకి వస్తున్నారుట. అనేకసార్లు వాయిదాల మీద వాయిదాలు పడిన అమిత్ షా ఏపీ టూర్ మొత్తానికి నవంబర్లో సెట్ అయినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా ఏపీ టూర్ అలా ఇలా ఉండదని కూడా అంటున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ నుంచి కూడా నేతలను ఎగరేసుకుపోతారని అంటున్నారు.


అమిత్ షా వద్ద అయస్కాంతం అలా పనిచేస్తుందని కూడా చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ తమ్ముళ్ళు కమలం కండువాను కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని కూడా చెబుతున్నారు. మరి వారెవరో వారి పేర్లు ఏంటన్నది తొందరలోనే చెబుతామని కూడా ఊరిస్తున్నారు. ఇక అమిత్ షా ఏపీ టూర్లో తమ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో కూడా చెప్పేస్తారట.


జగన్ మీద బీజేపీకి ఏ రకమైన అభిప్రాయం ఉందన్నది కూడా షా పర్యటన సందర్భంగా తెల్సిపోతుందని అంటున్నారు. ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తెలుగుదేశం  పార్టీలో చేరాలని  ఉవ్విళ్ళూరుతున్నట్లుగా గట్టి  సంకేతాలు ఇస్తున్నారు. బీజేపీలో బాబు చేరికకు గేట్లు మూసేసిన షా గేట్లు మళ్ళీ తెరుస్తారా  అన్న ఆసక్తి కూదా అందరిలోనూ ఉంది. మొత్తం మీద నవంబర్లో అమిత్ షా ఏపీ టూర్ మాత్రం ఎవరికి షాక్ ఇస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: