కేసీఆర్ మొదట అధికారంలోకి రాగానే తన మార్కు పథకాలకు శ్రీకారం చుట్టారు. వారిలో మిషన భగీరథ, మిషన్ కాకతీయ వంటివి ఉన్నాయి. మిషన్ భగీరథ కోసం కేసీఆర్ చాలా కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఇంటికీ నల్లానీరు ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో నూటికి 90 శాతం వరకూ ప్రజలకు తాగునీటి కష్టాలు తొలిగాయి.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో తెలంగాణ బాట పడుతోంది. ఏపీలోని 13 జిల్లాల్లో అందరికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్‌ గ్రీడ్‌ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇంటికి కూడా మనిషికి 105, 110 లీటర్లు ప్రతి రోజు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


దీని కోసం ఏపీ డ్రికింగ్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌కు నిధులు సమకూర్చుకునేందుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. సుమారుగా రూ.4.90 కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అంటే.. తెలంగాణలోని ప్రతి జనావాసానికి మంచినీరు అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ లాంటి పథకం ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలుకాబోతోందన్నమాట.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 47వేల జనాసావాలకు నీరు అందించడానికి రూ. 46,675 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ పథకం కోసం ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రూపకల్పన కోసం సీఎం జగన్ ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. సాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయనున్నారు. కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. 2022 నాటికల్లా ఈ ప్రాజెక్టను పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: