దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఒక వింత ఘటన జరిగింది. ఢిల్లీ పోలీసులు 13 రామచిలుకలను కోర్టులో ప్రవేశపెట్టారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా నిజంగానే ఈ ఘటన జరిగింది. పోలీసులు చట్టప్రకారం రామచిలుకలను కోర్టులో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. నిన్న సీ ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రయంలో ఉజ్జెకిస్థాన్ వెళ్తున్న అన్వర్ జాన్ అనే వ్యక్తిని, లగేజీని తనిఖీ చేశారు. లగేజీ తనిఖీ చేసే సమయంలో రామచిలుకలు చెప్పుల బాక్సులో ఉండటాన్ని సీ ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది గమనించారు. 
 
రామచిలుకలను అక్రమంగా అన్వర్ జాన్ విదేశాలకు తరలిస్తున్నాడని అన్వర్ పై కేసు నమోదు చేశారు. చెప్పుల బాక్స్ నుండి రామచిలుకలను బయటకు తీసి 13 రామచిలుకలను సీ ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు అక్రమంగా రామచిలుకలను తరలిస్తున్నాడని పోలీసులు అన్వర్ ను కోర్టులో హాజరు పరిచారు. కోర్టుకు అన్వర్ అక్రమంగా రామచిలుకలను తరలిస్తున్నాడని తెలియజేసేందుకు పోలీసులు రామచిలుకలను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. 
 
కోర్టు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రామచిలుకలను తరలించటం నేరంగా పరిగణించి అన్వర్ జాన్ కు ఈ నెల 30వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అన్వర్ జాన్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. కోర్టు అటవీశాఖ సంరక్షణ అధికారులకు 13 రామచిలుకలను అందజేస్తూ అడవుల్లో ఆ చిలుకలను వదిలిపెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. 
 
పోలీసుల విచారణలో అన్వర్ జాన్ రామచిలుకలను అక్రమంగా తరలిండానికి గల కారణాలు వెల్లడించాడు. అన్వర్ జాన్ ఓల్డ్ ఢిల్లీలోని ఒక వ్యాపారస్థుడి దగ్గరినుండి 13 రామచిలుకలను కొనుగోలు చేశానని, ఉజ్జెకిస్థాన్ లో రామచిలుకలకు విపరీతమైన డిమాండ్ ఉండటం వలనే రామచిలుకలను అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: