ఏపి రాజధాని అమరావతి విషయంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  దాదాపు రెండు నెలలపాటు దీనిపై అధ్యయనం చేసి, ఫైళ్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పనులను నిపుణుల కమికి అంచనా వేసింది.  ఈ కమిటీ చేసిన పరిశీలన తాలూకు విషయాలను రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ కు అందజేయబోతున్నారు.   గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, భూ సమీకరణ పేరుతో సేకరించిన భూములను పరిశీలించి ఆశ్చర్యపోయే విషయాలను కనుగొని నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది.


రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు  కమిటీ గుర్తించింది.  ఈ విషయాలను కూడా కమిటీ వారి నివేదికలో పొందుపరిచింది.  కేంద్రంలోని వివిధ శాఖలకు అవసరమైన భవనాల నిర్మాణాల ఖర్చులు  భారీగా ఉన్నట్టు గుర్తించింది.  అంతేకాదు, రాజధాని నగరంలో రోడ్ల నిర్మాణానికి 33 వేలకోట్ల రూపాయల ఆర్డర్లు ఇవ్వడం పై నిపుణుల కమిటీ షాక్ అయినట్టు తెలుస్తోంది.   అంతేకాకుండా,  సింగపూర్‌ కకన్సార్టియం కు అప్పగించిన స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుకు కేటాయించిన 1,681 ఎకరాల్లో 200 ఎకరాలను ఉచితంగా ఇవ్వడం, సింగపూర్‌ కన్సార్టియంతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.  

అయితే, ఇప్పటి ఈ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తోందని కావాలనే ప్రభుత్వం రాజధాని విషయాన్నీ పక్కన పెడుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఈ ఆరోపణలలో ఎంత వరకు నిజం ఉండనే విషయం తెలియాల్సి ఉన్నది.  అంతేకాదు, చాలావరకు పూర్తైన నిర్మాణాలు కూడా ఆగిపోయాయని, ఇలాగైతే రాజధాని ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండాల్సిందే అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.  రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు.  అయితే, రాజధానికి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని, అన్ని సక్రమంగానే జరుగుతాయని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు.  రాజధానిని మారుస్తున్నట్టు జగన్ ఎక్కడా చెప్పలేదని వైకాపా పార్టీ నేతలు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: