మనిషి మనసుపెట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు.  దానికి ఉదాహరణ స్పేస్ సైన్స్.  మనిషి సాధించిన ప్రగతికి స్పేస్ సైన్స్ ఒక నిదర్శనం గా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఒకప్పుడు మనం చంద్రుడిని దేవుడితో సమానంగా కొలిచేవాళ్ళం.  చాలా మంది చంద్రుని ఆకారానికి తగినట్టుగా సాయం సమయంలో భోజనం చేసేవారు.  గాంధీజీ తల్లిగారు ఇలా చేసేవారని అయన రాసుకున్న పుస్తకంలో ఉన్నది.  అలాంటి చందమామపై మనిషి పరిశోధనలు చేయడం.. దానికి అడుగుపెట్టడం అంటే మాములు విషయం కాదు.  ఒక గొప్ప ప్రగతిని సాధించినట్టే.  


ఇప్పటి వరకు మనిషికి ఆవాసయోగ్యమైనది భూమి మాత్రమే.  ఈ భూమిపై మనిషి జీవనం సాగిస్తున్నాడు.  భూమిపై మనిషి మనుగడ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు.  రోజురోజుకూ జనాభా పెరిగిపోతున్నది.  భూమి తరిగిపోతున్నది.  దీంతో అడవులను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తున్నారు.  ఫలితంగా మనుషులకు కావాల్సిన ఆక్సిజన్ లభించడం లేదు.  పైగా పర్యావరణం సమతుల్యత దెబ్బతింటోంది.  దీంతో అకాల వర్షాలు.. భూకంపాలు ఇలా ఎన్నో సంభవిస్తున్నాయి.  


అందుకే మనిషి భూమిపై కాకుండా మానవ ఆవాసయోగ్యమైన  వాటికోసం వెతుకులాట మొదలుపెట్టాడు.  అందులో ఒకటి చంద్రుడు, మరొకటి మార్స్. చంద్రుడిపై ఇప్పటికే మనిషి అనేక అనేక పరిశోధనలు చేస్తున్నాడు.  చంద్రునిపైకి ఉపగ్రహాలను పంపించి పరిశోధనలు చేస్తున్నారు.  అక్కడ దక్షిణ ధృవంలో నీటిజాడలు కనుక్కున్నారు.  అంతేకాదు, అక్కడకి శాస్త్రవేత్తలను పంపించి పరిశోధన చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు.  


అయితే, అక్కడ ఎక్కువ రోజులు ఉండాలంటే తగిన ఆహారం కావాలి.  ప్రతి మనిషికి రోజు కనీసం 1.8 కిలోల ఆహారం అవసరం అవుతుంది.  ఎంతమొత్తంలో రోజు అందించేందుకు తగినంతగా భూమి నుంచి అక్కడికి తీసుకెళ్లడం కష్టం.  కాబట్టి, అక్కడే పంట పండించేందుకు నేల అనుకూలంగా ఉన్నదా లేదా అని పరిశోధనలు చేశారు.  భూమిపై చంద్రుడు, మార్స్ కు సంబంధించిన వాతావరణాన్ని క్రియేట్ చేసి, అక్కడి నేలకు అనుగుణంగా మార్పులు చేసి, పదిరకాల విత్తలనాలు నాటితే.. పది రకాల పంటలు పండాయి. అయితే, అందులో పాలకూర మినహా మిగతా అన్ని ఏపుగా పెరిగాయి.  విచిత్రం ఏమిటంటే మార్స్ వాతావరణంలో పండించిన టమోటా పంట భూమిపై పండినట్టుగానే ఉండటం విశేషం.  మరికొన్ని పరిశోధనలు చేసిన తరువాత మనిషి చంద్రునిపైకి వెళ్లి అక్కడ పరిశోధనలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.  2028 నాటికి మనిషి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ జరుగుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: