ఎవరు ఎన్ని చెప్పినా పాక్ వినకపోవడంతో ఇప్పుడు అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.  ఎఫ్ఏటిఎఫ్ సంస్థ ఆ దేశాన్ని గ్రే లిస్టులో ఉంచింది.  2020లో ఆ దేశం గురించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు.  27 అంశాల్లో 20 అంశాలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ అంశాల విషయంలో పాక్ మిత్రదేశాలైన చైనా, టర్కీ, మలేషియా దేశాలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దీంతో పాక్ కు దారులు మూసుకుపోతున్నాయి.  అయితే, పాక్ దేశాన్ని ఇంకా బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు.  గ్రే లిస్టులో ఉండగానే ఆ దేశానికీ నిధులు తగ్గిపోయాయి.  


పాక్ కు చివరి అవకాశంగా 2020 వరకు సమయం ఇచ్చింది.  ఈలోగా 27అంశాలకు సంబంధించిన విధానాలు సక్రమంగా ఉండాలి.  లేదంటే మాత్రం ఆ దేశానికీ ఇబ్బందులు తప్పవు.  కానీ, చూస్తుంటే ఆ పరిస్థితులు ఉండేలా కనిపించడం లేదు.  ఎందుకంటే, అక్కడ ఆర్మీకి వ్యతిరేకంగా పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  అలానే ఆర్మీకి, అక్కడి ఉగ్రవాద సంస్థలకు లింకులు ఉన్నాయి.  వాటిని ఆర్మీ అసలు వదులుకోదు.  


మరి ఇలాంటి సమయంలో పాక్ వారిని కాదని అడుగు ముందుకు వేస్తుందా.. పాక్ ఆర్మీ ఉండగా మరొక దేశానికీ చెందిన ఆర్మీని తమ దేశంలోకి రానిస్తుందా చూడాలి.  పాక్ నిజంగా వారి దేశంలో ఉగ్రవాదులకు ఏరివేయాలని కోరుకుంటే.. దానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్ ఇప్పటికే ప్రకటించింది.  అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పింది.  కోరుకుంటే ఇండియన్ ఆర్మీని అక్కడికి పంపి ఉగ్రవాదులను ఏరివేస్తామని చెప్పింది.  


అందుకు పాక్ ఒప్పుకుంటుంది అని అనుకోవడం లేదు.  ఒకవేళ పాక్ గడ్డపైకి ఇండియన్ ఆర్మీ అడుగుపెట్టింది అంటే అది ఆ దేశానికీ అవమానంగా ఫీలవుతుంది. కాశ్మీర్లో ఏ ఆర్మీనైతే వ్యతిరేకించిందో ఆ ఆర్మీ పాక్ భూభాగంలోకి వచ్చి, పాక్ తరపున పోరాటం చేస్తుంటే.. అంతకంటే పాక్ కు మరో అవమానం ఉండదు.  అందుకే పాక్ దానికి అంగీకరించదు.  పైగా పాక్ కు ఇండియా శత్రుదేశం.  ఈ ప్రతిపాదన శతృదేశం నుంచి వచ్చింది అంటే దాని ఉద్దేశ్యం పాక్ కు చేతగాదు అనే అనుకుంటుంది.  మరి ఈ సమయంలో పాక్ నిర్ణయం ఏంటి అన్నది తెలియాలి.  ఒకవేళ ఎఫ్ఏటిఎఫ్ పాక్ ను వచ్చే ఏడాది బ్లాక్ లిస్ట్ లో పెడితే.. దానివలన ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి.  ఆ దేశం మరింత పేదరికంలో కూరుకొని పోవాల్సి వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: