ఏ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్షాలు రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి అంటూ ప్రభుత్వం ఆ సమస్యలను పట్టించుకోవాలంటూ  ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం... ఇక ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం కూడా కౌంటర్లు ఇవ్వడం కూడా కామనే.  అయితే మధ్యప్రదేశ్ లో  అదే జరిగింది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు బాగు చేయించాలని ప్రతిపక్షాల విమర్శలు చేస్తే... అక్కడి ప్రభుత్వం చాలా భిన్నంగా స్పందించింది. అయితే ప్రభుత్వం స్పందించిన తీరు అందరూ అవాక్కయ్యారు.  

 

 

 

 

 మధ్యప్రదేశ్ లోని రోడ్లపై అధికార ప్రతిపక్షాల మధ్య చాలా రోజులుగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని రోడ్లు దరిద్రంగా ఉన్నాయంటూ మాజీ సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వం పై  చాలాసార్లు విమర్శలు చేసారు .రాష్ట్రంలో  రోడ్లు మొత్తం  దరిద్రంగా ఉన్నాయని వాటిపై ప్రయాణిస్తున్న ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... అంతేకాకుండా ప్రమాదాల బారినపడి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని... రాష్ట్రంలోని రోడ్లన్నీ మరమ్మతులు చేసి బాగు చేయించాలి అంటూ మాజీ సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా మాజీ సీఎం శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీసీ శర్మ కౌంటర్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. 

 

 

 

 

 

 అయితే మాజీ మంత్రి శివరాజ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పీసీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ బాగానే ఉన్నాయని... భారీ వర్షాలు కురిసినప్పుడు ఏ రాష్ట్రం లో అయినా రోడ్లన్నీ  ఇలాగే మారుతాయని మంత్రి పిసిసి శర్మ బదులిచ్చారు. అయితే రాష్ట్రంలోని రోడ్లన్నీ వాషింగ్టన్ నగరం లోని రోడ్లతో పోటీ పడేలా నిర్మిస్తామని  మంత్రి తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లు   బిజెపి నేత కైలాష్ విజయ్ వర్గియ  బుగ్గల్లా  ఉన్నాయని... ముఖ్యమంత్రి రోడ్ల మరమ్మతులు చేసేందుకు ఆదేశిస్తే 15 రోజుల్లోనే వాటిని మరమ్మతులు చేసి బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల మార్చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి పిసి శర్మ. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం వివాదాస్పదంగా మంత్రి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: