తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలై  13వ రోజుకు చేరుకున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కార్మికులు డిమాండ్ లపై సరైన హామీ ఇవ్వలేదు. అది కాక సమ్మె చేస్తున్న 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పేసారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అసంబద్ధమైన అని విమర్శించారు. అయితే ఆర్టీసీ సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలపగా రోజు రోజుకు ఉధృతమవుతోంది ఆర్టీసీ సమ్మె. కాగా ఈ నెల 19న తెలంగాణ బంద్ నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఓ వైపు కెసిఆర్ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మె నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే  వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. 

 

 

 

 

 

 ఇదిలా ఉంటే కొంతమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తమను ఉద్యోగం నుంచి తొలగించడంతో  మనస్తాపం చెంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ ఆత్మహత్యలతో అయినా  కనీసం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావించి ప్రాణాలను అర్పిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇదిలా ఉంటే కార్మికుల వాదనపై చర్చించిన హైకోర్టు సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు సమాధానం కాదని చర్చలతోనే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలని హైకోర్టు కార్మికులకు అటు ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రభుత్వం తో తాము చర్చలకు సిద్ధం అని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు తెలిపారు... తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. 

 

 

 

 

 ఇదిలా ఉండగా సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అసంబద్ధమైన అని కేసీఆర్ అన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మికులు అనాలోచిత సమ్మెకు దిగారన్న  ముఖ్యమంత్రి కేసీఆర్... ఆర్టీసీ సమ్మెతో సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. కార్మికుల సమ్మె వల్ల ఆర్టీసీ సంస్థ కు దాదాపు 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం  చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరని  ఉద్యోగులను మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా ఈ నెల 21 నుంచి విద్యా సంస్థలు పునః  ప్రారంభం అవుతుండగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: