ఆంధ్రప్రదేశ్ తో కాంగ్రెస్ అధినేత్ర సోనియా ఆడుకొంటున్న తీరును చూస్తూ ఆవేదనతో తెలుగు వాళ్లు అనుకొంటున్న మాటలివి. తమ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో నిప్పులు పోసింది కాంగ్రెస్ అధిష్టానం. నాలుగేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఆల్లకల్లోలం చేసింది. పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సింది పోయి.. కేవలం తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాజకీయ నాయకులు అన్నాకా రాజకీయాలే చేస్తారు.. వారిని ఎన్నుకొన్నది, ఎన్నుకొనేది మనమే కాబట్టి.. వారిని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ రాజకీయవ్యూహాలను పన్నేటప్పుడు, వాటిని అమలు పెట్టే టప్పుడు ప్రజలు బలి అయితే మాత్రం సహించరాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామాకు అంతిమ బాధితులు ప్రజలే. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం తమకు ప్రయోజనకరంగా ఉంటుంది కాంగ్రెస్ భావించింది. మరి ఆ ఏర్పాటు చేసేదేదో.. కాస్తంత పద్ధతి ప్రకారం, రాజ్యాంగ బద్ధంగా చేసి ఉంటే.. అంత ప్రజావ్యతిరేకత ఉండేది కాదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణతో చాలా మూర్ఖంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నన్ని రోజులూ వారి మీద కక్ష గట్టినట్టు వ్యవహరించింది. ఇప్పుడు సీమాంధ్రులు ఉద్యమం చేస్తుంటే వీరిపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తోంది. మధ్య లో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతల తీరును పరిస్థితులను మరింత దుర్భరంగా మార్చేస్తోంది. ఎంతో కసరత్తుతో, ఎన్నో చర్చలతో జరగాల్సిన రాష్ట్ర విభజన నాలుగైదు మంది, నాలుగైదు రోజుల కూర్చొని చేసేదిగా మారింది. ఇదంతా కాంగ్రెస్ అధినేత్రి మూర్ఖత్వం ఫలితమేనని సమైక్యవాదులు నిందిస్తున్నారు. రాజకీయంగా బలపడటానికి మరో మార్గం చూసుకోవడం చేతగాని సోనియాగాంధీ మూర్ఖత్వంలో ఇలా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: