దశాబ్ధాలుగా కోర్టులో  రెండు మతాల  మధ్య కోనసాగుతున్న అయోధ్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసుపై రోజువారీ విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారంతో ఈ నెల 16న ముగించాలని భావిస్తోంది. బుధవారంసాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇరు వర్గాల వారి వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంటుందని.
.
ఆ తర్వాత అయోధ్య కేసుపై ఎవరి వాదనలను వినకూడదని యోచిస్తోంది. గత 39 రోజులుగా అయోధ్య కేసు వాదనలను వింటున్న CJI నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మొదట అక్టోబరు 17 వరకు డెడ్‌లైన్ విధించింది. ఐతే రాజ్యాంగ  ధర్మాసనం అంతకంటే ముందే ఈ నెల 16నే వాదనలు ముగించాలని భావిస్తోంది.

మంగళవారం కూడావాదనలు జరిగాయి. హిందూ సంస్థల తరపున వాదనలు వినిపిస్తున్న వైద్యనాథన్‌కు 45 నిమిషాలు, ప్రతివాదుల స్పందన చెప్పేందుకు ముస్లిం పార్టీలకు గంట పాటు సమయం కేటాయించారు. మిగిలిన హిందూ పార్టీలకు 45 నిమిషాల చొప్పున 4 భాగాలుగా సమయాన్ని కేటాయించారు. బుధవారం వాదనల ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేయనుంది రాజ్యాంగ ధర్మాసనం.అయోధ్య కేసును సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్
డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ విచారిస్తున్నారు.

ఇక ఈ కేసులో తుది తీర్పు నవంబరు 17 లోపే రావచ్చని సమాచారం. ఎందుకంటే నవంబరు 17నే సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఐతే ఆ రోజు ఆదివారం సెలవు. శనివారం కూడా కోర్టుకు సెలవుదినం కావడంతో అంతకంటే ముందే తీర్పు వచ్చే అవకాశముంది. నవంబరు 4 నుంచి నవంబరు 15 లోపు ఎప్పుడైనా వెలువడవచ్చని సమాచారం.మరి ఈసారి అయినా తీర్పు వెలువడుతుందో లేదో మరి వేచి చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: