నేడు హుజూర్​నగర్​ ఉప ఎన్నికల  కోసం సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు అన్ని రకాల ఎర్పాట్లు పూర్తి చేశారు. ఈ బహిరంగ సభ ట్రెండ్ సెట్టింగ్ సభ అవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నారు. నిజంగానే కారు దూసుకెళ్తుందా లేదా అనేది అక్టోబర్ 24న తెలుస్తుంది.


ఇక హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా కోన సాగుతోంది అని అందరికి తెలిసందే. పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పార్టీకి  కంచుకోట లాంటి హుజూర్‌నగర్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గట్టి  ప్రయత్నాలు చేస్తోంది. ఇంకో వైపు ఉప ఎన్నికల బరిలో ఉత్సాహంగా దూకే టీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా ఉత్తమ్ ఫ్యామిలీకి చెక్ పెట్టాలి అని  సర్వ శక్తులూ ప్రయత్నం చేస్తుంది. ప్రచారానికి తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. నేడు సీఎం కేసీఆర్‌‌తో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.


ఈ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే ఈ సభను ట్రెండ్ సెట్టింగ్ సభ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తెలియచేశారు. హుజూర్‌నగర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని.. ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలి అని కోరారు.


హుజూర్‌నగర్లో గెలిచి తీరుతామని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాగా బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్‌ కేడర్ బలంగా ఉన్నప్పటికీ.. ఎన్నికల ముందు భారీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరడం కూడా జరిగింది. ఇది తమకు కలిసొస్తుందని టీఆర్ఎస్ భావన వ్యక్తం చేస్తుంది. ముందుగా టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలతో మద్దతు ఉపసంహరించు కోవడం అందరం చూసాం. కానీ ఈ ప్రభావం తమ మీద ఉండబోదని.. పైగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. ఈ ఎన్నికలో బరిలో దిగుతుండటం తమకు కలిసొస్తుందని గులాబీ నేతలు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: