ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.  ఓవైపు అధిక చార్జీలు వసూలు చేస్తూనే... మరోవైపు నిర్లక్షమైన  డ్రైవింగ్ తో ప్రయాణికుల  ప్రాణాలను ప్రమాదాల్లో నెడుతున్నారు . ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి .అయినా  ప్రైవేట్ ట్రావెల్స్ తీరులో  మాత్రం మార్పు రావడంలేదు... ఇప్పటికే అతివేగం నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన  సంఘటనలు ఎన్నో. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు  ఎంతో మంది జీవితాలను చింద్రం  చేస్తూ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. 

 

 ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక రోడ్డు ప్రమాదం గురించి మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం జరుగుతుంది. కాగా సౌదీ అరేబియా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా ప్రావిన్స్లోని అల్ అకల్  సెంటర్ వద్ద... యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా నడపడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పవిత్ర క్షేత్రమైన మక్కా సమీపంలో అతి వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రొక్లెయినర్   ఢీకొట్టింది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆల్ హమ్న  ఆసుపత్రికి తరలించారు. 

  

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా  ఈ ప్రైవేటు బస్సులో ఏషియన్,  అరబిక్ పౌరులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే మక్కా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన  ప్రధాని మోదీ... మృతుల కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు.  కాగా ఈ ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోదీ. అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందా లేక... బస్సులో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: