15 రోజుల్లో రాష్ట్రంలో రోడ్లను హేమామాలిని బుగ్గల్లా మారుస్తానని హామీ ఇచ్చాడో మంత్రి. ప్రస్తుతం ఓ బిజెపీ నేత బుగ్గల్లా ఉన్న రోడ్లని, నున్నగా మార్చేస్తానని చెప్పుకొచ్చాడు. మధ్య ప్రదేశ్‌ మంత్రి పీసీ శర్మ కామెంట్స్‌ పై విమర్శలు వినిపిస్తున్నాయి. 


రావుగోపాల్ రావ్ డైలాగ్ విన్నాడో  ఏమో  మరి.. అలాంటి క్రియేటివిటే చూపించాడు మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ. విమర్శల్లో, హామీల్లో కూడా కళాపోషణ చూపాడు.  ఇంతకీ. ..ఆ కళా పోషణేంటో చూడాలంటే... ఈ సాంగ్  చూడాలి. 


డ్రీమ్ గర్ల్‌ అందాలు చూశారు కదా.  మహా అందగత్తె హేమామాలిని  చెక్కిళ్లంత నునుపుగా  .. తమ రాష్ట్రంలోని రోడ్లను మారుస్తానన్నారు మంత్రిగారు. 15 రోజుల్లో రోడ్లు మరమ్మత్తు చేసి డ్రీమ్ గాళ్ బుగ్గల్లా మెరిపిస్తామని యమజోష్‌ గా హామీ ఇచ్చారు శర్మ. అందమైన హేమామాలిన బుగ్గల్ని  ఉపమాన వస్తువుగా మార్చుకున్న జోషి...అసలీ రోడ్లు ఎలా ఉన్నాయో చెప్పాడానికి.. వాడిన పోలిక  చూస్తే... నవ్వురాకమానదు. 


మధ్యప్రదేశ్ రోడ్లు, బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయట. మధ్యప్రదేశ్ లో రోడ్లు వాషింగ్టన్ రోడ్ల కంటే మెరుగ్గా ఉన్నాయని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెండేళ్ల కిందట చేసిన ప్రకటనను మంత్రి శర్మ ఎద్దేవా చేశారు. వాషింగ్టన్ తరహాలో మధ్యప్రదేశ్ లో రోడ్లను నిర్మిస్తే వాటి పరిస్థితి ఇలా ఎందుకయిందని ప్రశ్నించారు. ఇప్పుడు రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడి బీజేపీ నేత కైలాష్విజయ వర్గీయ బుగ్గల్లా మారాయి అని విమర్శించారు. ఇక్కడితో ఈ చెంప గోల ఆగితే బాగానే ఉండేది. కానీ  ఆ రోడ్లకు ప్లాస్టిక్ సర్జరీ అవసరమంటూ,  తమ ప్రభుత్వం డ్రీమ్ గర్ల్ హేమ మాలిని బుగ్గల్లా రోడ్లను తీర్చిదిద్దుతుందని చెప్పుకొచ్చారు. రోడ్లను హేమమాలిని బుగ్గల్లా పోల్చడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: