రాజధాని స్కాంపై మాజి ముఖ్యమంత్రి అయిన, చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అవకతవకలని బయట పెట్టబోతున్నారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజధాని నిర్మాణంలో జరిగిన  అనేక అవకతవకలపై  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే తమ అధ్యయనాన్ని పూర్తి చేసారు. అందుకు సంబంధించిన నివేదికను మరో మూడు,నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రికి  సమర్పించనున్నారు  కమిటీ సభ్యులు.

ఆ నివేదికలో అత్యంత  కీలకమయిన, మరియు ఆసక్తికరమయిన విషయాలున్నాయని తెలుస్తుంది. రాజధాని పేరు చెప్పి  అందరు ఏ రేంజ్ లో దోపిడీ చేసారో, కమిటీ తేల్చిందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని కీలకమయిన విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. 
వాటి వివరాలు లోకి వెళ్ళితే, సాధారణంగా పెద్ద నగరాల్లో  బిల్డర్లు అపార్ట్ మెంట్లు, భారీ భవంతులు వంటివి నిర్మించడానికి వెచ్చిస్తున్న మొత్తం, చదరపు అడుగుకు మూడువేల రూపాయల నుంచి ఐదువేల రూపాయల వరకూ ఉంది.

హైదరాబాద్  లాంటి పెద్ద పెద్ద మాల్స్ కు పెడుతున్న ఖర్చు చదరపు అడుగుకు ఐదు వేల రూపాయలు. అయితే ఏపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు పదివేల రూపాయల మొత్తంతో అప్పగించించారట. స్థలం ప్రభుత్వం వారిది అయినా, చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా పెద్ద స్కామ్ అని స్పష్టం చేసారు. ఇక కన్సల్టెన్సీలకు ఖర్చుచేసిన మొత్తం అక్షరాలా 540  కోట్ల రూపాయలు. భవనాలను డిజైన్ చేసిన నార్మన్ ఫోస్టర్స్ కు 240 కోట్ల రూపాయలు.

ఇంత రేటుతో  కేవలం డిజైన్లు కాదు ఏకంగా  ఒరిజినల్  భవనాలనే నిర్మించవచ్చు అని చెప్తున్నారు. ఇలాంటి విస్మయకరమైన మరియు ఆసక్తికరమయిన నిజాలు బట్టబయలు కాబోతుంది అని,రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దోపిడీ పూర్తిగా ప్రజల ముందుకు రాబోతోందని,అతి తొందరలో వాళ్ళ బండారం బయటపెట్టపోతునట్టు,సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: