ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపిపిఎస్సీ భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేశారు. మామూలుగా ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల్లో రాత పరీక్షకు కొన్ని మార్కులు, ఇంటర్య్వూకు ఇన్ని మార్కులని ఉంటుంది. రాత పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినా, ఇంటర్వ్యూ అనే సరకి ఎవరినో ఒకరిని పట్టుకుని మ్యానేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.

 

రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో మ్యాగ్జిమమ్ మార్కులు మ్యానేజ్ చేసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దాంతో వెంటనే కొందరు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. దాంతో కోర్టు కూడా స్టే ఇస్తుండటంతో ఉద్యోగాల భర్తీ ఆగిపోతోంది.

 

ఏపిపిఎస్సీ చేపట్టే ప్రతీ నియామకాలు కోర్టు జోక్యంతోనే ఆగిపోతున్నాయి. దాంతో ఉద్యోగాల భర్తీ తక్కువ కోర్టు కేసులు ఎక్కువ అన్నట్లు అయిపోయింది పరిస్ధితి. ఈ విధానంపై సమీక్ష చేసిన జగన్ అసలు ఇంటర్వ్యూ విధానాన్నే రద్దు చేసేస్తే సరిపోతుంది కదా అని అనుకున్నారు. నిపుణులు ఈ విషయాన్ని ఎప్పటి నుండో చెబుతున్నారు. దాంతో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు.

 

అదే సమయంలో ఏపిపిఎస్సీ పరీక్షల నిర్వహణలో ఐఐటి, ఐఐఎంల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని కూడా జగన్ డిసైడ్ చేశారు. ఏపిపిఎస్సీ ద్వారా చేయాలని అనుకుంటున్న ఉద్యోగాల భర్తీకి కోర్టు కేసులు అడ్డంకిగా మారిన విషయమై జగన్ కాస్త సీరియస్ అయ్యారు. అందుకనే ఐఐటి, ఐఐఎం భాగస్వామ్యంతో పరీక్షలను నిర్వహిస్తే వివాదాలు తగ్గుతాయని జగన్ అనుకుంటున్నారు.

 

తాజా నిర్ణయం ప్రకారం 2020 జనవరి నుండి భర్తీ చేయబోయే ప్రతీ నియామకంలోను కేవలం రాత పరీక్షలోనే పూర్తి మార్కులు తెచ్చుకోవాల్సుంటుంది అభ్యర్ధులు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ఉన్నతాధికారులను  ఆదేశించారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: