ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మొదలై నేటితో  13వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకోలేదు. సమ్మె చేస్తున్న కార్మికులను విధుల  నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి . దీంతో  మనస్తాపం చెందిన కొందరు కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  బస్సులన్నీ డిపోలకే పరిమితం అవ్వగా... ప్రైవేటు అద్దె బస్సులను తిప్పుతుంది ప్రభుత్వం. అయితే అవి  కూడా ప్రయాణికుల పూర్తి అవసరాలను తీర్చ లేక పోతున్నాను. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ సర్వీస్ లైన ఓలా,  ఉబెర్ లాంటి టాక్సీలను  ఆశ్రయిస్తూ ఆఫీసులకు, తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు . 

 

 

 

 

 ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎక్కువ ప్రజల అవసరాలు తీరుస్తుంది ఈ ప్రైవేటు సర్వీసులే .  ఇక ట్యాక్సీలను  బుక్ చేయడం కూడా సులభం కావడంతో ఎక్కువమంది ప్రజలు ఈ  టాక్సీ లని ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రయాణికులకు ఆ సౌలభ్యం కూడా కరువయ్యేట్లు  కనిపిస్తుంది . ఎందుకంటే ఈ నెల 19 నుంచి ఓలా ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ఓనర్లు సమ్మె చేసేందుకు పిలుపునిచ్చారు . ఈనెల 19 నుంచి ఓలా ఉబెర్  క్యాబ్ డ్రైవర్లు ఓనర్లు నిరవధిక సమ్మె చేపట్టేందుకు ఓలా క్యాబ్ డ్రైవర్ల జెఎసి పిలుపునిచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి లేఖ ఇచ్చామని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మే  చేయాలా వద్దా అనే దానిపై అసోసియేషన్  ఓటింగ్ నిర్వహించడంతో 75 శాతం సమ్మె వైపే మొగ్గు చూపారని అన్నారు. ఈ నేపథ్యంలో ఓలా ఉబర్ జేఏసీ  సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు.

 

 

 

 

అయితే ఓలా ఉబెర్ జేఏసీ  ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలో పలు డిమాండ్లను లేవనెత్తారు. ఓలా, ఉబర్ డ్రైవర్ల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి కిలోమీటర్‌కు రూ.22 చెల్లించాలని...  లెక్కకు మిక్కిలిగా క్యాబ్స్‌ను నియమించుకోకూడదని తెలిపారు. ఐటీ కంపెనీలకు అటాచ్ అయిన డ్రైవర్ల కోసం జీవో 61,66ను  అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. డ్రైవర్ల మీద దాడులు చేసే కస్టమర్లను గుర్తించేందుకు కేవైసీ ఏర్పాటు చేయడంతోపాటు...డ్రైవర్ల భద్రత కోసం ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా..  ఇక టాక్సీ డ్రైవర్లు కూడా సమ్మె చేపడితే ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: