మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 'సైరా నరసింహారెడ్డి' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ఆధార అభిమానాలను గెలిచినా విషయం మన అందరికి తెలిసిన విషయమే . ఇపుడు మెగాస్టార్ చిరంజీవి తన  సినిమా 'సైరా నరసింహారెడ్డి' ప్రమోషన్ కోసం ఢిల్లీ చేరారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ ను, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తన సినిమాను వీక్షించాల్సిందిగా కోరిన చిరంజీవి ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు తన సినిమా గురించి తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలవడం జరిగిందట.


ప్రత్యేక షో ఏర్పాటు చేసి ఉప రాష్ట్రపతికి ఆ సినిమాను చూపబోతున్నారట. వెంకయ్య నాయుడుతో కలిసి ఆ సినిమాను చిరంజీవి కూడా వీక్షించనున్నారట. అలాగే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా చిరంజీవి కలుస్తారని సమాచారం. వారికి కూడా సినిమా గురించి వివరించి, వీక్షించాల్సిందిగా కోరనున్నట్టుగా తెలుస్తోంది.


మొత్తానికి సినిమాతో చాలామంది రాజకీయ నేతలనే కలుస్తున్నారు చిరంజీవి. రాజకీయాల్లోకి వచ్చి వైదొలిగిన ఆయన తన సినిమాతో మొత్తం రాజకీయ నేతలతో సమావేశం అవుతుండటం గమనార్హం. ఇది ఇలా ఉండగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు రాష్ట్రము లో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది కానీ ఓవర్సీస్,రెస్ట్ అఫ్ ఇండియా,కర్ణాటక ,కేరళ మరియు తమిళనాడు లో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలని తెచ్చిపెటింది . తెలుగు రాష్ట్రం లో మరో రెండు వారలు అయిన కలెక్షన్స్ పరంగా ఇలాంటి ఊపు కొనసాగించాలి అని డిస్ట్రిబ్యూటర్స్ కోరుకుంటున్నారు.

ఇక, రాష్ట్ర విభజన..రాజ్యసభ సభ్యత్వం పూర్తయిన తరువాత చిరంజీవి పూర్తిగా సినిమాకుల దూరంగా ఉంటున్నారు. తన సోదరులిద్దరూ జనసేన నుండి పోటీ చేసినా దాని మీద ఫోకస్ చేయలేదు. కనీసం కామెంట్ చేయలేదు. తాజాగా డబ్బు ప్రభావం కారణంగా తాను..తన సోదరుడు తమ సొంత జిల్లాలో ఓడిపోయామని మాత్రం చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: