అట్ల తద్ది రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. ఉత్తరాదిన ఈ పండుగను కర్వా చౌత్ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశం మహిళలు తెలుగు రాష్ట్రాల కంటే ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఉత్తరాది మహిళలు ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుండి సాయంత్రం చంద్రుడు అస్తమించే వరకు ఉపవాసం ఉంటారు. పూజలు సాయంత్రం సమయంలో చేస్తారు. 
 
పూజలు చేసిన తరువాత చంద్రుడిని జల్లెడలో చూసి ఆ తరువాత అదే జల్లెడలో భర్త ముఖం కూడా చూసి ఉపవాసం విడిస్తే మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నిండునూరేళ్లు భర్తలు జీవిస్తారని మహిళలు నమ్ముతారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మాథురాలోని విజాయి గ్రామంలో మాత్రం మహిళలు కర్వా చౌత్ పండుగ రోజు ఉపవాసం ఉంటే భర్త చనిపోతాడనే నమ్మకం విజాయి గ్రామ ప్రజల్లో ఉంది. 
 
విజాయి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఒక శాపం కారణంగా ఉపవాసం చేసిన మహిళల భర్తలు చనిపోతారని నమ్ముతారు. పూర్వం ఒక బ్రాహ్మణ మహిళ విజాయి గ్రామంలో తన భర్తతో కలిసి వెళ్లే సమయంలో కర్వా చౌత్ పండుగ రోజున విజాయి గ్రామస్థులు భార్యాభర్తలపై దాడి చేయటంతో బ్రాహ్మణ మహిళ భర్త మరణించాడట. తన కళ్ల ముందే భర్త చనిపోవటంతో బాధ మరియు ఆగ్రహంతో బ్రాహ్మణ మహిళ ఆ గ్రామ మహిళలకు శాపం పెట్టిందని తెలుస్తోంది. 
 
శాపం పెట్టిన తరువాత బ్రాహ్మణ మహిళ భర్త చితిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు చెబుతున్నారు. కర్వా చౌత్ పండుగ విజాయి గ్రామంలో 200 సంవత్సరాల నుండి ఈ శాపం వలన మహిళలు జరుపుకోవటం లేదు. కర్వా చౌత్ పండుగ రోజున మహిళలు కుంకుమ కూడా కొనరని పుట్టింటి నుండి తెచ్చుకున్న కుంకుమ మాత్రమే ఉపయోగిస్తారని సమాచారం. 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: