భారత క్రికెట్‌ జట్టులో గంగూలీ ధోని కున్న స్థానాలు వేరే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఓ చిన్న కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారాలు సాగుతున్నాయి.. ఈ మధ్య మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని పరిస్థితి జట్టుతో ఉండీ లేనట్లుగా ఉంది. ఒకవైపు అతను మ్యాచ్‌లు ఆడటం లేదు... అలా అని అధికారికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. తాను ఏ సిరీస్‌లు ఆడలనుకుంటున్నాడో కేవలం వాటిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగనేలేదు. అసలు ధోని సెలక్టర్లకు ఏం చెప్పాడో ధోనికి మాత్రమే తెలుసు.

ఈ మధ్య కొత్తగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్‌ గంగూలీ దీనిపై స్పందించి ధోని విషయంలో తనకు మరింత స్పష్టత కావాల్సి ఉందంటూ చెప్పుకొచ్చారు. గంగూలీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు ఈ నెల 24న సెలక్టర్లతో సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. 

ధోనికి సంబంధించి సెలెక్టర్ల ఆలోచనలు ఏమిటో నేను తెలుసుకుంటా... ఆ తర్వాత నా అభిప్రాయం వెల్లడిస్తా... అసలు ధోని ఏమనుకుంటున్నాడో కూడా తెలియాల్సి ఉంది..,,, ఇప్పటి వరకు నాకు ఎలాంటి సంబంధం లేకపోవడం వలన నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అధికారిక హోదాలో దీని గురించి సమాచారం తెలుసుకొని ఏం చేయాలో నిర్ణయిస్తా’ అంటూ గంగూలీ స్పష్టం చేశాడు. 

మాహీ బరిలోకి దిగితే మ్యాచ్ విజయం ఖాయమని నమ్మే క్రికెట్ అభిమానులకు మైదానంలో ధోని కనిపించక పోతే వారి పరిస్థితి., టీం ఇండియా పరిస్థితి ని దృష్టిలో ఉంచుకొని బలవంతంగా అయిన సరే మళ్ళీ ధోనీని పిచ్ లో చూడలనేది గంగూలీ ఆశ.. అందుకోసం ఎంత వార్ అయిన ధోనీతో చేయడానికి సిద్ధమైన గంగూలీ ప్రత్యేక దృష్టి సరిస్తున్నట్టు సమాచారం..

మన ఇండియన్ క్రికెట్ జట్టులో ఎంత గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికిని ధోని ఆట కున్న అభిమానులు., ధోని స్థానం ప్రత్యేకం......

  

మరింత సమాచారం తెలుసుకోండి: