పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అని ఒకటి అందుబాటులో ఉంది. పోస్టాఫీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. రిస్క్ తీసుకోవడం ఇష్టంలేని వారు పోస్టాఫీస్‌ స్కీమ్‌లో చేరొచ్చు. దీంతో నిశ్చింతగా ప్రతి నెలా రూ.5,700 పొందొచ్చు.పోస్టాఫీస్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్ మెచ్యూరిటీ సమయం 5 ఏళ్లు. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. వడ్డీని ప్రతి నెలా చెల్లిస్తారు. 


ఒకరు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేస్తే అప్పుడు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం. ఐదేళ్లలో మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై రూ.1,71,000 రాబడి వస్తుంది. అంటే నెలకు రూ.2,850 మొత్తాన్ని పొందొచ్చు.ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే.. అకౌంట్‌లో రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు రూ.3,42,000 రాబడి వస్తుంది. అంటే నెలకు రూ.5,700 పొందొచ్చు.


పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ను మజోర్ల్ తో పాటు మైనర్ల పేరుపై కూడా ప్రారంభించొచ్చు.పదేళ్లు, ఆపైన వయసు ఉన్న వారు అకౌంట్‌ ప్రారంభించొచ్చు.పోస్టాఫీస్‌లోని సేవింగ్స్ అకౌంట్ ద్వారా మీ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రత నెలా వడ్డీ ఆటోమేటిక్‌గానే మీ ఖాతాలో జమవుతుంది.                                                                                      


దీని ద్వారా నెలకు రూ.5,700 పొందొచ్చు. అయితే దీని కోసం మీరు రూ.9 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈ పోస్టాఫీస్ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. గరిష్టంగా రూ.9 లక్షలు మాత్రమే ఇన్వె్స్ట్ చేయగలం.                                                                                                                                                                     


మరింత సమాచారం తెలుసుకోండి: