రాజకీయాల్లో ప్రతి పక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షం మీద విమర్శలు చేయడం సహజమే. ఇరు పక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవడం కొత్తేమీ కాదు. అయితే అధికార పక్షంలో కూర్చుండి ప్రతిపక్షాన్ని విమర్శించిన వారు సడెన్ గా ఆ అధికారాన్ని కోల్పోతే ఎలా ఉంటుంది? టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి  జగన్ ముఖ్యమంత్రి కాకముందు అనేక విమర్శలు చేశాడు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై అనేక సార్లు విమర్శించాడు.


అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీన్ రివర్స్ అయింది. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో జగన్ ప్రభుత్వం దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. దివాకర్ రెడ్డి కి చెందిన 23 బస్సులను ఏపీ రవాణా శాఖ సీజ్ చేసింది. దివాకర్ ట్రావెల్స్ పేరుతో నడుస్తున్న ఈ బస్సులు నిబంధనలకి విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, అలాగే ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు వసూలు చేస్తున్నారన్న కారణంగా తనిఖీలు నిర్వహించి మొత్తం 23 బస్సులని గుర్తించి వాటి లైసెన్లులను రద్దు చేశారు.


అంతేకాదు దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్‌ స్టేట్‌ క్యారియల్‌ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న కారణంగా ఈ ట్రావెల్స్ పై పలు కేసులు  కూడా నమోదు చేశారు. ఈ తనిఖీలు రవాణాశాఖ కమీషనర్ సీతారామాంజనేయులు, జాయింట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలో జరిగాయి. అయితే దివాకర్ ట్రావెల్స్ లో బస్సులు నిబంధనలకి విరుద్ధంగా నడుస్తున్నాయని అనేక ఫిర్యాదులు అందడంతోనే తనిఖీలు నిర్వహించామని చెప్పారు. మరి దివాకర్ రెడ్డి ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డి జగన్ ని విమర్శిస్తాడా లేదా అతనితో సంధి కుదుర్చుకుంటాడా అనేది ఆసక్తిగా ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: