అందరికి అన్నం పెట్టె రైతుకు ఎంత చేసిన తక్కువే. ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని పథకాలు పెట్టి సాయం చేసిన అవి ‘చంద్రునికో నూలు పోగు’ లాంటివే. ఎందుకంటే వారి కష్టం అనిర్వచనీయమైంది. గట్టిగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం కూడా రైతులకు పూర్తి భరోసా ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చాలావరకు భరోసా దొరికిందనే చెప్పొచ్చు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి నాలుగున్నర నెలల కాలంలోనే రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు.


అందులో ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ రైతు భరోసా-పి‌ఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు రూ. 13,500 సాయం చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకాన్ని అక్టోబర్ 15న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సాయంలో కేంద్రం వాటా రూ. 6 వేలు ఉండగా, రాష్ట్రం వాటా రూ. 7,500 గా ఉంది. ఈ రెండు సాయాలని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఈ సాయం రైతులకు ఎంతో కొంత ఊరటనివ్వనుంది.


అయితే ఇదేగాక జగన్ రైతుల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, సున్నా వడ్డీకే రుణాలు. ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు.  గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌ రద్దు. ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం ఇవ్వనున్నారు.


రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్‌ ఉచిత బీమా పథకం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు. ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ జగన్ నాలుగు నెలల కాలంలోని తీసుకుని రైతులకు కొంతమేర భరోసా ఇచ్చారనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: