9 ఏళ్ళు ప్రతిపక్షంలో కష్టపడి, మొన్న ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఎప్పుడు లేని విధంగా ఒకేసారి కేబినెట్ బెర్తులని భర్తీ చేసి పాలనలో దూసుకుపోతున్నారు. అయితే ఒకేసారి కేబినెట్ బెర్తులని భర్తీ చేసిన జగన్...ఇప్పుడు కేబినెట్ స్థానం దక్కించుకున్న వారిని రెండున్నర సంవత్సరాలతో తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తానని ముందే చెప్పేశారు. అయితే పనితీరు మంచిగా ఉన్న మంత్రులని అలాగే కొనసాగిస్తానని కూడా చెప్పారు.


ఇక జగన్ పాలన మొదలుపెట్టి దాదాపు ఐదు నెలలు అవుతుంది. ఈ ఐదు నెలల కాలంలో కొందరు మంత్రుల పని తీరు బాగోలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని జగన్ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. చాలామంది మంత్రుల పని తీరు బాగుందని చెప్పిన జగన్...కొందరి మీద మాత్రం అవినీతి ఆరోపణలు వచ్చాయని, వారు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.


కొందరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్న జగన్ వారి పేర్లను బయటకు చెప్పకుండా హెచ్చరించారు. అయితే ఇప్పుడు వారి పేర్లను కూడా బహిర్గతం చేయకూడదు అనుకుంటున్నానని, తాను వారిని పర్సనల్ గా పిలిచి మాట్లాడతానని చెప్పారు. అయితే అప్పటికి తీరు మార్చుకోకపోతే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడనని, తనతోనే కేబినెట్ నుంచి తప్పించేలా చేసుకుని, తనని బాధపెట్టొద్దని జగన్ చెప్పినట్లు సమాచారం.


అయితే మంత్రులని జగన్ హెచ్చరించడం ఇదే రెండోసారి. ఇదివరకు జరిగిన కేబినెట్ సమావేశంలో ఒకసారి మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇన్నిసార్లు వార్నింగ్స్ రావడంతో రెండేళ్ల తర్వాత వీరిని కేబినెట్ నుంచి తప్పించి కొత్తవారికి అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈలోపు వారు పని తీరు మార్చుకోకపోతే అప్పటికప్పుడే మంత్రివర్గం నుంచి వారికి ఉద్వాసన పలకడం ఖాయమే. ఏదేమైనా మంత్రుల విష‌యంలో కూడా జ‌గ‌న్ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేద‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: