ఈ పార్టీలోనైనా ఫైర్ బ్రాండ్ నేతలు ఉండటం కామన్. తమ పార్టీ వాయిస్ ని బలంగా వినిపిస్తూ..ప్రత్యర్ధ పార్టీలు చేసే విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొడతారు. తమదైన శైలిలో బిగ్గర వాయిస్ తో ప్రత్యర్ధ పార్టీలకు చుక్కలు చూపిస్తారు. అయితే ఇలాంటి ఫైర్ బ్రాండ్ నేతలకు అధికార వైసీపీలో కొదవ లేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే జోగి రమేశ్ లాంటి నేతలకు ప్రత్యేక స్థానం ఉంది.  అప్పుడు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న జోగి రమేశ్ తన వాయిస్ ఏ మాత్రం తగ్గించలేదు.


అయితే కాంగ్రెస్ లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జోగి వైఎస్‌కు ఆప్తుడిగా ఉండేవారు. 2009 ఎన్నికల్లో పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో జోగి మైల‌వ‌రం సీటు ఆశించ‌గా చివ‌ర్లో పెడ‌న సీటు ద‌క్కింది. ఇక వైఎస్ మరణంతో జోగి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున మైలవరం నుంచి ఓడిపోయారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి...టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.


తమ ప్రభుత్వం మీదగాని, తమ అధినేత, సీఎం జగన్ మీదగానీ టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తే అసలు ఊరుకోవడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులని ఎత్తి చూపుతూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేసే ప్రతి విమర్శకు జోగి వెంటనే కౌంటర్ ఇచ్చేస్తున్నారు. మీడియా సమావేశం పెట్టేసి ఏకీపారేస్తున్నారు. ఇక గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా జోగి టీడీపీని ఒక ఆట ఆడుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్ లో టీడీపీపై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి టీడీపీపై ఫైర్ అవ్వడంలో జోగి అస్సలు తగ్గడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: