ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నారా లోకేశ్...పూర్తిగా ట్విట్టర్ పిట్టగా మారిపోయారు. ప్రతి రోజు ట్విట్టర్ వేదికగానే విమర్శలు చేస్తున్నారు. అయితే లోకేశ్ ట్విట్టర్ కే పరిమితం అవ్వడం పట్ల టీడీపీ కేడర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. లోకేశ్ ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్ లో పెద్ద నాయకుడుగా ఎదగడం కష్టమని భావిస్తున్నారు. 2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న లోకేశ్....మొన్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన దగ్గర నుంచి బయట పెద్దగా కనబడటం లేదు.


అయితే టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయిన, చంద్రబాబు తనయుడుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. మంత్రిగా లోకేశ్ ఓ రేంజ్ లో హడావిడి చేశారు. ప్రతి విషయంలో అధికారం చెలాయించారు.  ఇక తాను స్పీచుల్లో ఏం మాట్లాడుతారో తెలియక పార్టీకే నష్టం తెచ్చారు. ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి ప్రత్యక్ష పోటీకి దిగి వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి దెబ్బకు లోకేశ్ బయట ఎక్కువ కనబడటం లేదు.


ఎక్కువ ట్విట్టర్ లోనే గడిపేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వంపై ప్రతి రోజు ట్విట్టర్ వేదికగానే విమర్శలు చేస్తున్నారు. ఇంతవరకు బయటకొచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సందర్భం లేదు. కానీ బయటకొస్తే ఏం మాట్లాడతారో తెలియకే లోకేశ్  ఇలా ఎక్కువగా ట్విట్టర్ లోనే విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


కానీ భవిష్యత్ లో టీడీపీని నడిపించే నాయకుడు అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో లోకేశ్ ఇలా ట్విట్టర్ కే పరిమితం అవ్వడం పార్టీకి ఇబ్బందే. దీని వల్ల ఆయన నాయకుడుగా ఎదగలేడని కేడర్ భావిస్తుంది. మరి చూడాలి లోకేశ్ ట్విట్టర్ లోనే కూస్తారో...లేక బయటకొచ్చి పోరాడుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: