ఓ ఎమ్మెల్యే దారి త‌ప్పాడు. ఆయ‌న అధికార పార్టీకి చెందిన కీల‌క ఎమ్మెల్యే. అధికారిపైనే దూకుడు ప్ర‌ద‌ర్శిం చాడు.. ఇప్పుడు ఏం చేయాలి?  కేసు పెడితే.. సీఎం సార్ కి కోపం వ‌స్తుందేమో?!.. ఉద్యోగం ఊడుతుందే మో..!! - ఆ భ‌యం ఇప్పుడు లేదు. త‌ప్పు చేసిన వారు సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా.. సామాన్య పౌరులైనా చ‌ట్టం ముందు ఒక్క‌రే! ఇదే సూత్రాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నామంటే సేవ‌కులుగా వ‌చ్చామే త‌ప్ప‌.. సేవ చేయించుకునేందుకు.. దౌర్జ‌న్యాలు చేసేందుకు కాద‌ని ఆయ‌న సీఎంగా ప్ర‌మాణం చేసిన వెంట‌నే త‌న పార్టీ 150 మంది ఎమ్మెల్యేల‌కు చేసిన హిత బోధ‌.


దీనిని ఆయ‌న పాటిస్తారో.. లేదో.. అంత సాధుజీవిగా ఉంటారా?  చ‌ట్టాన్ని అంద‌రికీ స‌మానంగా వ‌ర్తింప జేస్తారా?  ఇలాంటి అనేక సందేహాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. ఇక‌, జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించేవారు ఇవ‌న్నీ కేవ లం మాట‌ల‌కే ప‌రిమితం అని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధించారు. క‌ట్ చేస్తే.. పాల‌న ప్రారంభించి కేవ లం ఐదు మాసాలు కూడా కానేలేదు.. జ‌గ‌న్ త‌నేంటో.. త‌న మాట‌కు, త‌న‌చేత‌కు తానిచ్చే వాల్యూ ఏంటో నిరూపించుకుంటున్నారు.


ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దారిత‌ప్పితే.. మిగిలి న వారి మాటేమో కానీ.. తాను మాత్రం త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్నారు. వారు ఎలాంటి వారైనా కానీ.. అరెస్టు చేయాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్ప‌టికి రెండు ఘ‌ట నల్లో .. జ‌గ‌న్ త‌న చిత్త‌శుద్దిని నిరూపించుకున్నారు. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఓ లేఅవుట్‌కు సంబంధించి అనుమ‌తుల విష‌యం ఎంపీడీవోతో వివాదానికి దిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.


ఈ క్ర‌మంలో ఆమె త‌న‌ను కోటంరెడ్డి బెదిరించార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జ‌గ‌న్ రంగంలోకి దిగి.. కేసు పూర్వాప‌రాలు ప‌రిశీలించి త‌ప్పు కోటంరెడ్డి వైపు ఉంటే.. త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల‌ని ఆదేశించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లా తునిలో ఓ కీల‌క ప‌త్రిక విలేకరి సత్యనారాయణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్యకు సంబంధించి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై విలేకరి సత్యనారాయణ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంలోనూ పోలీసులు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నారు.


ఫిర్యాదును న‌మోదు చేయ‌డంతోపాటు.. అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సో.. ఇలాంటి ఘ‌ట‌న‌లు తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు .. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న ఎలా ఉందో.. ఆ పార్టీకి చెందిన నాయ‌కులు బ‌రితెగించి.. ప్ర‌జ‌లపై ప‌డిన‌ప్పుడు.. అధికారుల‌ను వేధించిన‌ప్పుడు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు?  ఇప్పుడు జ‌గ‌న్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు..? అని ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించ‌క‌మాన‌రు క‌దా!



మరింత సమాచారం తెలుసుకోండి: