తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 13వ రోజుకు చేరుకున్న తరుణంలో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. ఇప్పుడు వరకు కార్మికుల డిమాండ్ లపై  సరైన పరిష్కారం చూప లేదు ముఖ్యమంత్రి కేసీఆర్.  ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో మనస్తాపం చెందిన ఆర్టీసీ ఉద్యోగులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా తెలిసింది. తమ ఆత్మబలిదానాలతో  అయిన ఆర్టిసి కి న్యాయం జరుగుతుందని ప్రాణాలను అర్పిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు అర్పిస్తున్నా... మరోవైపు ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పై మొండిపట్టు వీడక  పోతుండడంతో సమ్మే  రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. 

 

 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికులు తమ వాదన హైకోర్టులో వినిపించినప్పటికీ... హైకోర్టు కూడా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అటు ప్రభుత్వానికి ఇటు కార్మికులకు తెలిపింది. కార్మికులు ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది . అయితే తాజాగా ఆర్టీసీ సమ్మె పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరిన  ఉద్యోగులను  మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా  కొనసాగిస్తామని మిగతా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సమ్మె రోజురోజుకూ తీవ్రమవుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్ని  సమ్మెకు మద్దతు తెలపగా... అటు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తుంది. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మె రీతిలో రోజురోజుకూ పెరుగుతోంది. కాగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఫోన్ ట్యాప్  చేస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు, సీఎం పీఠం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని టీఎస్ ఆర్టీసీ  జేఏసీ కన్వీనర్ వ్యాఖ్యానించారు. అయితే సమ్మె నేపథ్యంలో తన ఫోన్ లో టాప్ చేస్తున్నారని... ఎన్టీఆర్ కంటే గొప్ప మేధావి కెసిఆర్ కాదని గుర్తుంచుకోవాలని విమర్శించారు అశ్వద్ధామ రెడ్డి. అయితే కొందరు మంత్రులు ఆర్టీసీ కార్మికుల సమ్మె పై విమర్శలు చేసి ఆపై ఇంటికి వెళ్లి బాధపడుతున్నారని అశ్వద్ధామ రెడ్డి అన్నారు. అయితే సమ్మెపై  మేధావులు మౌనం వీడాల్సిన  సమయం వచ్చిందని పేర్కొన్న అశ్వద్ధామ  రెడ్డి... సమ్మె పరిష్కారం కాకుంటే మాత్రం 1994 సంక్షోభం పునరావృత్తం అవుతుందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోకూడదని హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: