మరమనిషి లేదా రోబో అనేది ఒక వాస్తవికమైన లేదా యాంత్రిక కృత్రిమ ఉపకరణం. వాడుకలో, దీనిని సాధారణంగా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ (వైద్యుత క్రమణిక) మార్గనిర్దేశంతో పని చేసే ఒక విద్యుత్-యాంత్రిక ఉపకరణంగా పిలుస్తారు, ఇది సొంతంగా పనులు నిర్వర్తించగలదు. ఆకారం లేదా కదలికల వలన, సొంత ఉద్దేశ్యం లేదా యంత్రాంగం ఉన్నట్లు కనిపించడం రోబోట్ యొక్క మరో సాధారణ లక్షణంఆధునిక .


యుగంలో రోబోట్ ల పాత్ర పెరుగుతుంది అందుకే మన ప్రభుత్వం ముందడుగు వేసి  మన దాదాపు 31 కాలేజీల్లో అడ్వాన్స్‌ రోబోటిక్‌ కోర్సును అందుబాటులోకితెస్తామని  ఆంధ్రప్రదేశ్‌ సిల్క్‌ అండ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చల్లా మధుసూధన్‌ రెడ్డిగారు  తెలిపారు. 


విజయవాడలో గురువారం జరిగిన విలేకరులో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ కోర్సుతో దాదాపు 1000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతారని, ఇందుకోసం అర్క్‌ జర్మనీ టెక్నాలజీ వారు  ప్రత్యేకంగా కోర్సును నేర్పుతున్నట్లు పేర్కొన్నారు.  ఈ సమావేశంలో యురోపియన్‌ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ప్రెసిడెంట్ వివిఎన్ రాజ్ మాట్లాడుతూ..  దాదాపు 20 కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో ఈ కోర్సును అందిస్తున్నామన్నారు. 


దీంతో రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రాజ్‌ తెలిపారు.విద్యార్థులందరికి అడ్వాన్స్‌ టెక్నాలజీ కోర్సులను అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకే అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అర్క్‌ నేర్చుకున్న వారికి భవిష్యత్‌ ఉంటుందనే ఉద్దేశంతోనే జర్మనీ నుంచి ఏపీకి వచ్చామన్నారు. నిరుద్యోగ యువతకు టెక్నాలజీ ద్వారా ఉపాధి కల్పించటమే లక్ష్యంగా 31 కాలేజీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. విద్యార్థులను నైపుణ్యలుగా చేసేందుకు విద్యార్థి దశలోనే టెక్నాలజీపై అవగాహన కల్పిస్తే ఉపయోగం ఉంటుందన్నారు. ఇందుకోసం జర్మనీ ప్రభుత్వం సహకారంతో ఈ టెక్నాలజీని తెచ్చామని వివిఎన్‌ రాజ్‌ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: