రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు క్లారిటి ఇచ్చేసినట్లే అనుకోవాలి. కాకపోతే ఆ క్లారిటి తాను ఇవ్వకుండా మున్సిపల్ మంత్రి బొత్సా సత్యనారాయణ ద్వారా ఇప్పించారనే అనుకోవాలి. చంద్రబాబునాయుడు హయాంలో రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణాలు, ముంపు ప్రాంతాలను పరిశీలించటం కోసం నిపుణుల కమిటిని నియమించబోతున్నట్లు బొత్సా తెలిపారు.

 

ఆ నిపుణుల కమిటి రెండు రోజుల్లో తన పర్యటన మొదలుపెట్టి రాష్ట్రంలోని 13 జిల్లాలు తిరిగి జనాల అభిప్రాయాలు సేకరిస్తుందని చెప్పారు. మంత్రి చెప్పిన విషయాన్ని చూస్తుంటే చంద్రబాబు కలలుగన్న విదేశీ తరహా రాజధానుల లాగ అయితే ఉండదని తేలిపోయింది. అంటే సింగపూర్ తో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాలేవి కూడా అమల్లోకి రావని తేలిపోతోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు లాగ జగన్ భ్రమల్లో కాకుండా వాస్తవ ధృక్పదంతో ఆలోచిస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది. అందుకనే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రం పూర్తి చేసి మిగిలినవి అలానే వదిలేస్తారు.

 

శాస్వత సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ మాత్రం నిర్మించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదికూడా తుళ్ళూరు మండలం శివారు ప్రాంతాలు అంటే మంగళగిరి వైపు చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి రాజధాని నిర్మాణం విషయంలో జగన్ పూర్తి క్లారిటి వచ్చేసినట్లే కనబడుతోంది.

 

ఇక చంద్రబాబు హయాంలో జరిగిన భూ కుంభకోణాలపైన కూడా నిపుణుల కమిటి అధ్యయనం చేస్తుందని మంత్రి చెప్పారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చదరపు అడుగు నిర్మాణానికి మహా అయితే రూ 5 వేలుంటే చాలా ఎక్కువ. కానీ రాజధాని ప్రాంతంలో మాత్రం చంద్రబాబు రూ. 10 వేలతో ఒప్పందాలు చేసుకున్నారంటేనే ఏ స్ధాయిలో కుంభకోణం జరిగిందో అర్ధమైపోతోంది. కాబట్టి రాజధాని నిర్మాణం విషయంలో జనాలు ఎటువంటి అయోమయానికి గురవ్వాల్సిన అవసరం లేదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: