జుస్టిక్ రంజన్ గగోయ్ విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.  మాములుగా ఈనెల 18 వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లి అక్టోబర్ 31 వ తేదీన తిరిగి ఇండియాకు రావాల్సి ఉన్నది.  ఈజిప్ట్, బ్రెజిల్, అమెరికాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అయన వెళ్లాల్సి ఉన్నది.  కానీ, పర్యటనను రద్దు చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు.  అయోధ్య కేసులో తీర్పు చెప్పాల్సి ఉన్నది.  వచ్చే నెల 17 వ తేదీలోగా తీర్పును చెప్పాలి.  


ఆగష్టు 6 వ తేదీ నుంచి అక్టోబర్ 16 వ తేదీ వరకు మొత్తం 40 రోజులపాటు ఈ కేసు గురించి విచారణ జరిగింది.  ఈ విచారణను విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.  తీర్పును రిజర్వ్ చేసిన తరువాత నెల రోజుల్లోగా తీర్పును వెలువరించాలి.  అక్టోబర్ 16, 17 తేదీలు సెలవుపై కావడంతో అక్టోబర్ 15 వ తేదీ లోపుగానే తీర్పును వెలువరించాలి.  ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించబోతున్నది.  


అయితే, గతంలో 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్య విషయంలో తీర్పు చెప్పింది.  ఆ తీర్పును సవాల్ చేస్తూ 14 పిటిషనలు సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు.  అప్పటి నుంచి కోర్టు ఈ కేసు నడుస్తూనే ఉన్నది.  కాగా, ఆగష్టు 6 వ తేదీ నుంచి ఈ కేసులో తుది విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్న సుప్రీ కోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులున్న ఈ ధర్మాసనంలోని సభ్యులు 40 రోజులపాటు  వాదనలు విన్నారు.  


ఇప్పుడు తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానిచుట్టునే అందరి చూపులు ఉన్నాయి.  తీర్పు నెలరోజుల్లోపు వెలువరించాలి.  నెలరోజుల్లోపు కాబట్టి ఈ నెలరోజుల్లోపు ఎప్పుడైనా సరే వెలువడే అవకాశం ఉన్నది.  ఆ తీర్పు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది.. అన్నది తెలియాల్సి ఉన్నది.  తీర్పు వెలువడే సమయంలో దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: