తెలంగాణ లో మద్యం దుకాణాల నిర్వహణకు టెండర్ల దాఖలు ప్రక్రియ కు గురువారం చివరి రోజు కావడం తో పలు చోట్ల వ్యాపారుల మధ్య  గలాటాలు , తోపులాటలు చేసుకున్నాయి . మద్యం దుకాణాల నిర్వహణ కు దరఖాస్తు చేసుకునేందుకు ఈసారి పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యాపారాలు కూడా పోటీపడి టెండర్లను దాఖలు చేశారు . ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న నేపధ్యం లో , తెలంగాణ లో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వారు టెండర్ ప్రక్రియ లో పాల్గొనడం, మేడ్చల్ , మల్కాజ్ గిరి జిల్లాలో  వివాదానికి దారి తీసింది.


 హైదరాబాద్ నగర శివారు నాగోల్ లోని  ఒక  ఫంక్షన్ హాల్లో మద్యం దుకాణాల నిర్వహణ కు వ్యాపారుల నుంచి   టెండర్ల స్వీకరించారు . అయితే టెండర్ల ప్రక్రియ లో పాల్గొన్న రెండు వర్గాలు తోపులాట దిగడమే కాకుండా, టెండర్లు దక్కించుకునేందుకు కొంతమంది  లోకల్,  నాన్ లోకల్ పేరిట  విభేదాలతో సృష్టించే ప్రయత్నం చేశారు . దీనితో ఒక దశలో ఇరు  వర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది . ఈ సందర్బంగా తమ  ఏరియా లోకి మీరు వచ్చి  ఎలా టెండర్లు దాఖలు చేస్తారంటూ కొంతమంది నాన్ లోకల్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి . దీనితో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు లోకి తీసుకువచ్చారు.


టెండర్ల   పక్రియ ను  మేడ్చల్  జిల్లా కలెక్టర్ ఎంవి  రెడ్డి దగ్గర ఉండి పర్వవేక్షించడమే కాకుండా , టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు సూచించారు . టెండర్ల దాఖలు సందర్బంగా ఎవరికీ ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా  తగిన చర్యలు తీసుకోవాలని   కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: