దేశంలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు ఈనెల 21 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  రేపటితో ప్రచారానికి తెరపడబోతున్నది.  ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి.  ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ చూస్తున్నది.  ఎన్నికల్లో తమదే విషయం అని చెప్పి బీజేపీ ఖచ్చితంగా చెప్తున్నది.  తమ విజయాన్ని  ఎవరూ అడ్డుకోలేరని, విజయం తథ్యం అని అంటోంది బీజేపీ.  


దీనికోసం ఇప్పటికే అన్ని చోట్ల ప్రచారం కూడా నిర్వహించారు.  గతంలో కంటే బీజేపీకి అత్యధిక సీట్లు రావడం ఖాయం అని,  తిరిగి ఫడ్నవిస్ నేతృత్వంలో మహారాష్ట్రలో బీజేపీ శివసేనతో కలిసి  చేస్తుందని షా చెప్పారు.  హర్యానాలో సైతం పార్టీ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.  సిబిఐ, ఈడీ ల అధికారాలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వార్తలు వస్తున్నాయనే దానిపై షా స్పందించారు.  


యూపీఏ హయాంలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగానే సిబిఐ, ఈడీ లు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని అన్నారు.  వాటి స్వతంత్రత విషయంలో ఎప్పుడు బీజేపీ అడ్డు అడ్డు చెప్పదని పేర్కొన్నారు.  బీహార్ లో కూడా పొత్తు ఉంటుందని, నితీష్ నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు.  కిందిస్థాయిలో కొంతమేర ఇబ్బందులు ఉండొచ్చుగాని, విజయం మాత్రం తమదే అవుతుందని అన్నారు.  ఇక ఇదిలా ఉంటె  పశ్చిమబెంగాల్ గురించి షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  


2021లో బెంగాల్ లో జరిగే ఎన్నికలో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు. గంగూలీ మంచి నాయకుడని, క్రికెట్లో గంగూలీ కెప్టెన్ గా ఎన్నో విజయాలు సాధించాడని, గంగూలీతో రాజకీయాల గురించి చర్చించలేదని, మునుముందు ఏమైనా జరగొచ్చని అన్నారు.  2024 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు షా.  మునుముందు ఏమైనా జరగొచ్చు అంటే.. గంగూలీని బీజేపీలోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు అనే అర్ధం కూడా ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: