బాబా రామ్ దేవ్ చాలా కాలం తరువాత తిరిగి మీడియాతో మాట్లాడారు.  ఆ మధ్యకాలంలో అయన తరచుగా మాట్లాడుతుంటేవారు.  గత కొంతకాలంగా అయన మీడియాలో కనిపించడం లేదు.  కాగా,ఇప్పుడు రామ మందిరం విషయంలో అయన మళ్ళీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టిన సంగతి అందరికి తెలిసిందే అని, ఆ విషయాన్నీ ప్రతి ఒక్కరు అంగీకరిస్తారని, అయోధ్యలోని రామ మందిరం నిర్మించాలని అన్నారు.  


రాముడు జన్మించిన భూమికి ఎంతో ప్రాచుర్యం ఉందని అన్నారు.  ఇక కోర్టు ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలని పేర్కొన్నారు.  హిందువుల మనోభావాలకు తగినవిధంగా తీర్పు ఉండే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.  తప్పకుండా రామ మందిరం నిర్మాణం జరుగుతుందని చెప్పారు.  ఇక ఇదిలా ఉంటె, రాబోయే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల గురించి కూడా బాబా రామ్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  


హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు.  తాను బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.  మోడీ, షాలు దేశంలో సమర్ధవంతమైన నాయకులని చూపిన రామ్ దేవ్, అప్పట్లో ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. ఒకే జెండా అని కలగన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను మోడీ, షా లు నెరవేరుస్తున్నారని చెప్పారు.  2024 ఎన్నికల్లో సైతం మోడీ, షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు.  


దేశంలో ఇంకా అనేక మార్పులు రావాలని, అది మోడీ ప్రభుత్వంలోనే సాధ్యం అవుతుందని రామ్ దేవ్ పేర్కొన్నారు.  తప్పకుండా మార్పులు జారుతాయని చెప్పారు.  ఇంకా అనేక విషయాల్లో దేశం ముందుకు నడుస్తుందని చెప్పారు.   కాశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు బాబా రామ్ దేవ్. ఆర్టికల్ 370 రద్దు చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: