కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత కొన్ని సార్లు కొన్ని కొన్ని పొరపాట్లు జారుతూనే ఉన్నాయి.  ఆ పొరపాట్ల కారణంగా తప్పుగా చలానాలు విధిస్తున్నారు.  కారణం పొరపాటే.  అలాంటి పొరపాటు ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది.  హెల్మెట్ పెట్టుకోలేదని ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు చలానా విధించారు. కారణం ఏంటి అంటే హెల్మెట్ పెట్టుకోలేదని, అలానే డ్రైవింగ్ లైసెన్స్ తన దగ్గర ఉంచుకోలేదని చలానా విధించారు.  


విషయం ఏమిటంటే ట్రాక్టర్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న.  ట్రాక్టర్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోకపోతే చలానా వేస్తారా.. ద్విచక్రవాహననాలకు కదా హెల్మెట్ కావాల్సింది.  మరి ట్రాక్టర్ డ్రైవర్ కు ఎందుకు.. ఎలా పెట్టుకొని డ్రైవింగ్ చేస్తారు.. ఈ విషయాలు పోలీసులకు తెలియవా అంటే.. తెలుసు.. కాకపోతే... పొరపాటున ఇ చలనా వచ్చింది.  అయితే, సదరు డ్రైవర్ వెంటనే వెళ్ళి అధికారులను సంప్రదించాడు.  వాళ్ళు తప్పును గమనించి.. ఆ చలనాను రద్దు చేశారు.  


ఇలాంటి పొరపాటే ఉత్తరప్రదేశ్ లో కారు డ్రైవర్ విషయంలో కూడా జరిగింది.  కారులో సీటు బెల్ట్ పెట్టుకోలేదని చలానా వేయడం చూశాం.  పాపం ఆ తరువాత రోజు నుంచి ఆ కారు డ్రైవర్ కారులో కూడా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు.  ఇలా అప్పుడప్పుడు చాలా చోట్ల హెల్మెట్ లేదని చలానాలు వేస్తున్నారు.  అంతేకాదు, సైకిల్ ఫై వెళ్తున్న వాళ్ళను కూడా ఆపి హెల్మెట్ లేదని చలానాలు వేయడం చూస్తూనే ఉన్నాం.  


నిజమే కదా సైకిల్ పై వెళ్లిన కిందపడితే దెబ్బలు తగులుతాయి.  అందులో సందేహం అవసరం లేదు.  దేనిమీద నుంచి పడినా దెబ్బ దెబ్బె అవుతుంది.  రెండు చక్రాల వాహనం అంటే వాహనమే.  విదేశాల్లో సైకిల్ పై వెళ్లే సమయంలో కూడా దానికి తగిన హెల్మెట్ తప్పనిసరిగా ఉంటుంది.  కానీ మనదగ్గర మాత్రం వాటిని వాడేందుకు మనవాళ్ళు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: