భలే మంచి చౌకబేరము.. రండి బాబు రండి.. తక్కువ ధరకే నాలుగు ఇడ్లీలు ఇస్తున్నారు.. తక్కువ ధరకే టిఫిన్ అంటే మన వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు.  ఎందుకంటే తక్కువ ధరకు ఇస్తున్నారు అంటే అవి ఎలా ఉన్నాయో అని సందేహిస్తారు.  కానీ, అలాంటి సందేహాలు ఏమి అవసరం లేదు.  తక్కువ ధరకు ఇడ్లీలు అందిస్తున్నది ఎవరో కాదు.. మెహబూబ్ నగర్ జిల్లా జైలు అధికారులు టిఫిన్ షాప్ పెట్టి ఇడ్లీ అమ్ముతున్నారు.  


అదేంటి ఎందుకలా అని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా.. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఈ టిఫిన్ షాప్ ను ఓపెన్ చేయించారు అధికారులు. జైలు ఎదురుగా ఓ షాప్ తీసుకొని అందులో ఈ టిఫిన్ షాప్ ను మూడు రోజుల క్రితం ఓపెన్ చేయించారు.  ఈ టిఫిన్ షాప్ గురించి మెహబూబ్ నగర్ మొత్తం పాకింది.  మొదటి రోజు కేవలం 400 మంది వరకు కస్టమర్లు వచ్చారు.  


టిఫిన్ రుచిగా ఉండటం, తక్కువ ధరకే లభిస్తుండటంతో.. క్రమంగా రద్దీ పెరిగింది.  కేవలం మూడు రోజుల్లోనే దాదాపుగా 1100 మంది కస్టమర్లు వచ్చారట.  ఈ రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ఖైదీలు నిరంతరం టిఫీన్ సెంటర్లో పని చేస్తున్నారని, తప్పకుండా ఇది సక్సెస్ అయితే, ఇలాంటివి మరికొన్ని ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు చెప్తున్నారు.  


ఈ జైలు పక్కనే ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ కూడా ఉన్నది.  అది కూడా మంచి సక్సెస్ అయ్యింది. కేవలం టిఫిన్ సెంటర్ ఇడ్లీనే కాకుండా.. రూ.5కు టీ కూడా ఇస్తున్నారు. రోజుకు రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు వ్యాపారం నడుస్తోంది. నాణ్యమైన అల్పాహారం తక్కువ ధరకు ఇస్తుండటంతో ఎక్కువమంది తినేందుకు వస్తున్నట్లు జిల్లా జైలు పర్యవేక్షకులు సంతోష్‌రాయ్‌ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: