కేంద్ర మంత్రివర్గం ఏర్పడి అయిదు నెలలు గడుస్తున్నాయి. ఒక్కొక్కరికీ నాలుగైదు శాఖలు కూడా ఇచ్చి మరీ ప్రధాని మోడీ పనిచేయిస్తున్నారు. మరో వైపు కేంద్ర క్యాబినెట్లో బెర్త్ దొరకని వారు నిరాశలో ఉన్నారు. ఇక ఏపీ లాంటి రాష్ట్రాలకు ఒక మంత్రి పదవిని కూడా బీజేపీ ఇవ్వలేదు. వీటన్నిటికీ ఒకే ఒక సమాధానంగా కేంద్ర మంత్రి వర్గాన్ని ఈసారి విస్తరించి సమగ్రమైన కూర్పుని చేయాలని మోడీ డిసైడ్ అయ్యారట.


సాధ్యమైనంత తొందరలో మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు. ఈ విస్తర‌ణలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఏపీకి సంబంధించి మాత్రం కచ్చితంగా ఒకరికి బెర్త్ ఖాయమని అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరు అన్నది ఇపుడు అందరిలోనూ చర్చనీయాంశంగా ఉందిట. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి బిగ్ జంప్ చేసిన సుజనా చౌదరి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.


ఆయన గతంలో మోడీ క్యాబినెట్లో పనిచేసిన వారు కావడం ప్లస్ పాయింట్. అలాగే టీడీపీ సామాజికవర్గానికి చెందిన వారు మరో ప్లస్ పాయింట్. ఆర్ధికంగా బలమైన నేత కావడం, కోస్తాలో బలమైన కమ్మలను తనవైపునకు తిప్పుకునేందుకు వీలున్న నేత కావడంతో ఆయన్ని కనుక మంత్రిని చేస్తే పార్టీ విస్త‌రణకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న కోణంలో కూడా బీజేపీలో చర్చ సాగుతోందట. అయితే పార్టీ ఫిరాయించి  వచ్చారన్న మైనస్ పాయింట్ సుజనా చౌదరిని వెంటాడుతోంది. దానికి తోడు గతంలో అవినీతి ఆరోపణలు, కేసులు కూడా మరో మైనస్ పాయింట్ అంటున్నారు.


ఇక బీజేపీలో చేరినా టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారన్న విమర్శలు కూడా సుజన మీద ఉన్నాయి. మొత్తం మీద తీసుకుంటే సుజనా చౌదరి కేంద్ర మంత్రి అయ్యేందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉన్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో సుజనా కాక మరెవరు అని బీజేపీ అనుకున్నా కూడా ఇంకొకరు లేకపోవడం కూడా ఆయన ఆశలను పెంచేస్తోంది. సుజనా కనుక కేంద్ర మంత్రి అయితే చంద్రబాబు పంట పండినట్లేనని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ, టీడీపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: