ఆంధ్రప్రదేశ్ రాజధానిని  అమరావతి నుంచి వేరే చోటకు మారుస్తున్నట్లు  మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం గా మారాయి . అయితే దీనిపై ఇప్పటికి  రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి మారుస్తారా లేదా అన్నదానిపై విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఏపీ రాజధాని అమరావతి పై బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎలా ఉండాలి... ఎక్కడ ఉండాలి...ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టాలి  దానిపై నిపుణుల కమిటీని నియమించామని .... కమిటీ నాలుగు రోజుల్లో పని ప్రారంభిస్తుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తారని తెలిపారు. 

 

 

 

 అయితే అప్పటి మంత్రి పి. నారాయణ  ఇచ్చిన కమిటీ ద్వారానే అమరావతి నిర్మించారని... శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.అయితే తమ  ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ మీటింగ్ లో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. అయితే హైకోర్టు పై వస్తున్న డిమాండ్ కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు మంత్రి. కాగా  అమరావతిలో భవనం నిర్మించాలంటే వంద అడుగుల లోతు వరకు పునాది  తోవ్వాల్సి ఉంటుందన్న మంత్రి... ఇలా చేయడం వల్ల ప్రజాధనం చాలా దుర్వినియోగం అవుతోందని... అంతేకాకుండా అవినీతి కూడా జరుగుతుందని అన్నారు. 

 

 

 

 అయితే ప్రస్తుతం అమరావతిలో నిలిచిపోయిన కొన్ని పనులు అవసరమైన వాటిని  చేపట్టి... కొన్నింటిని ఆపేస్తామని వచ్చే స్పష్టం చేశారు. అయితే పేదలకు ఇల్లు నిర్మాణ విషయంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయం అధికంగా ఉందని... పునాది దశలో ఉన్న 50 వేల ఇళ్ల విషయంలో రివర్స్ టెండరింగ్ వెళ్తామని  ప్రభుత్వ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. కాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాళ్లో  బొత్స వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: