సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఊరట లభిస్తుందా ? అనే విషయంలో వైసిపి వర్గాల్లో టెన్షన్  పెరిగిపోతోంది.  అక్రమార్జన కేసుల విచారణ నుండి తనకు వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్ వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వవద్దంటూ సిబిఐ పసలేని ఆరోపణలతో కౌంటర్ వేసింది. రెండు పిటిషన్ల పరిశీలన తర్వాత కోర్టులో ఈ రోజు విచారణ జరగబోతోంది.

 

నిజానికి అక్రమార్జన కేసులకు  సంబంధించి జగన్ పై చాలా కేసులే నమోదైనా ఇప్పటి వరకూ ఒక్క కేసును కూడా సిబిఐ నిరూపించలేకపోతోంది. దాదాపు పదేళ్ళుగా కేసుల విచారణ నత్తకే నడకలు నేర్పుతోందనటంలో సందేహం లేదు. ఒక్క కేసులో కూడా సరైన ఆధారాలను చూపించకపోవటంతో కేసుల విచారణలో హై కోర్టు కూడా గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి అందరకూ తెలిసిందే.

 

జగన్ పై కేసులు రాజకీయ కక్షసాధింపు కోవలోకి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేయగానే కేసలు పడ్డాయి. కాంగ్రెస్, టిడిపి నేతలు కూడబలుక్కునే హై కోర్టులో పిటీషన్ వేశారనే ప్రచారం జరుగుతోంది.

 

జగన్ మీద కోపంతో  కాంగ్రెస్ కేసులు వేసిందంటే అర్ధముంది. మరి టిడిపి నేత యర్రంనాయుడు కేసులో ఎందుకు ఇంప్లీడయ్యారు ? కేసులన్నీ రాజకీయ నేపధ్యంలోనే దాఖలైనా బాధితుడు మాత్రం జగనే. అందుకే కేసుల విచారణ ఎలాగున్నా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని జగన్ కోరుతున్నారు. పైగా ఇపుడు ముఖ్యమంత్రి కూడా. శుక్రవారం నాడు మాత్రమే జగన్ కోర్టుకు హాజరవుతున్నారు.

 

ఇక్కడే సిబిఐ వాదనలో పసలేదని తెలిసిపోతోంది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వనంత మాత్రాన  జగన్ సాక్ష్యులను మ్యానేజ్ చేయలేరా ? సాక్ష్యులను మ్యానేజ్ చేయటానికి వ్యక్తిగత మినహాయింపుకు ఏమిటి సంబంధం ? సరే సిబిఐ వాదనలు ఎలాగున్నా కోర్టు ఏమంటుందో బహుశా ఈరోజు తేలిపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: